MLA Bandari Lakshma Reddy | చర్లపల్లి, జూన్ 25 : ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని కాలనీల సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి చర్లపల్లి డివిజన్ పరిధిలోని ఇందిరాగృహకల్ప కాలనీ, విద్యమారుతినగర్ కాలనీలో నాయకులు, కాలనీవాసులతో కలిసి పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని, పార్టీలకు అతీతంగా చర్లపల్లి డివిజన్ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. ఐజీ కాలనీ, విద్యమారుతినగర్లో నెలకొన్న సమస్యలను దశలవారిగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని, డివిజన్లలో సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నేమూరి మహేశ్‌గౌడ్, గిరిబాబు, పద్మారెడ్డి, బాబు, రెడ్డినాయక్, మధులతోపాటు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
మెరుగైన వైద్య సేవలు అందించాలి : ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
ఉప్పల్, జూన్ 25 : ఉప్పల్ టిఎక్స్ హాస్పిటల్ లో అనారోగ్యంతో బాధపడుతున్న ఉప్పల్ డివిజన్ భారత రాష్ట్ర సమితి పార్టీ సీనియర్ నాయకులు నిరంజన్ చారి తండ్రి నాగభూషణంని బుధవారం ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పరామర్శించారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.
High Court | మూడు నెలల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించండి : తెలంగాణ హైకోర్టు ఆదేశం
Gupta Nidhulu | గుప్తనిధుల కోసం ఆంజనేయ స్వామి ఆలయంలో తవ్వకాలు
cricket tournament | యువత క్రీడల్లో రాణించాలి.. క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన చల్మెడ