Corporator Bonthu Sridevi | చర్లపల్లి, జూన్ 28 : చర్లపల్లి డివిజన్లో ఆలయాలను అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేయనున్నట్లు జీహెచ్ఎంసీ స్టాడింగ్ కమిటి సభ్యురాలు, డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి పేర్కొన్నారు.
డివిజన్ పరిధిలోని ఆలయాలను అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయించాలని, డివిజన్లో బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు నిధులు కేటాయించాలని కోరుతూ సంబంధిత మంత్రి కొండా సురేఖకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ బొంతు శ్రీదేవి మట్లాడుతూ..డివిజన్ పరిధిలోని కుషాయిగూడ వెంకటేశ్వరస్వామి ఆలయం, చర్లపల్లిలో రామాలయం, మహంకాళి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు తగు చర్యలు తీసుకుంటామని ఆమె పేర్కొన్నారు.
ముఖ్యంగా వెంకటేశ్వరస్వామి ఆలయం ముందు ఉన్న అర ఎకరం స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్‌ను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Harish Rao | తెలంగాణ వాది స్వేచ్ఛ అకాల మరణం ఎంతో బాధాకరం : హరీశ్‌రావు
Operation Sindhu | ఆపరేషన్ సింధు ద్వారా 4,415 మంది భారతీయుల్ని తరలించాం : కేంద్రం