MLA Madhavaram krishna rao | అల్లాపూర్, మే 26 : మోతీ నగర్లో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు పూర్తి చేసేందుకు కృషి చేస్తానని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఈ నెల 28న మోతినగర్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో డాక్టర్ ఎస్ వి ప్రసాద్ నేతృత్వంలో సొసైటీ సభ్యులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి తమ మ్యానిఫెస్టోను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ.. మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు బాగున్నాయని.. మోతీ నగర్లో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు పూర్తి చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గతంలో సొసైటీలో కొందరు సభ్యులు నిధుల దుర్వినియోగానికి పాల్పడిన అంశాన్ని తానే స్వయంగా డిప్యూటీ రిజిస్ట్రార్‌కు లేఖ రాసిన తర్వాతే ఆ విషయం వెలుగులోకి వచ్చిందని గుర్తు చేశారు. మోతీ నగర్ ప్రజలు విజ్ఞతతో కూడిన ఓటర్లను, మంచి ప్యానెల్‌ను ఎన్నుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Nakirekal : తీవ్ర సంక్షోభంలో ప్రభుత్వ పాఠశాల విద్య : మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
Godavarikhani | కాళేశ్వరం పుష్కరాల సేవలో భ్రమరాంభిక సేవకులకు ప్రశంసలు