ACP Venkatreddy | చర్లపల్లి, మే 31 : కుషాయిగూడ డివిజన్ పరిధిలో నేరాలను అదుపు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కుషాయిగూడ డివిజన్ ఏసీపీ వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. మీర్‌పేట హెచ్‌బీకాలనీ డివిజన్ చైతన్యనగర్ టూబీహెచ్‌కే డిగ్నిటీ హౌసింగ్ కాలనీ చైతన్యనగర్ సోషల్ వెల్ఫేర్ అసోసియెషన్ రిజిస్ట్రేషన్ గుర్తింపు సాధించిన సందర్భంగా కాలనీవాసులు ఏసీపీ వెంకట్‌రెడ్డిని కలిసి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డివిజన్ పరిధిలోని పోలీస్స్టేషన్లలో అనుమానితులు కనిపిస్తే సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించాలని, ముఖ్యంగా కాలనీలలో పోలీస్ పెట్రోలింగ్‌ను మరింత పెంచామన్నారు. డబుల్‌బెడ్ రూం కాలనీలో పోలీస్ పెట్రోలింగ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాలనీవాసులు బోడ నరేశ్, సీత మహాలక్ష్మి, లక్ష్మి, జ్యోతి, నజీమా, రజని, పాల్రాజు, అంజయ్య, విద్యాధర్‌రావు, కుమార్, మధు తదితరులు పాల్గొన్నారు.
PM Modi | ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసేవారికి ఆపరేషన్ సిందూర్ తగిన సమాధానం : ప్రధాని మోదీ
Sunkishala | సిటీకి సుంకిశాలే శరణ్యం.. కేసీఆర్ దిశలోనే కాంగ్రెస్ సర్కారు
Navy plane Crashes | ఘోర ప్రమాదం.. కూలిన నేవీ విమానం