PM Modi | భారత్‌లో ఉగ్రవాదం వ్యాప్తికి (Unleased Terror) సహకరించే వారికి ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) తగిన సమాధానం అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు. ఉగ్రవాదంపై పోరాడేందుకు దేశం మొత్తం ఏకమైందని పేర్కొన్నారు.
సిక్కిం (Sikkim) రాష్ట్ర హోదా పొంది 50 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని వర్చువల్‌గా పాల్గొని ప్రసంగించారు. హిమాలయ రాష్ట్రమైన సిక్కిం దేశానికి గర్వకారణమన్నారు. ఇక్కడి ప్రజలు ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తారని పేర్కొన్నారు. ‘గత నెలలో పహల్గాం దాడి తర్వాత చేపట్టిన ఆపరేషన్ సిందూర్.. భారత్‌లో ఉగ్రవాదాన్ని వ్యాప్తిచేసేవారికి తగిన సమాధానం. పహల్గాంలో ఉగ్రవాదులు చేసింది మానవత్వంపై దాడి. ఇప్పుడు ఉగ్రవాదంపై పోరాడేందుకు దేశం మొత్తం ఏకమైంది’ అని చెప్పుకొచ్చారు.
వాస్తవానికి ప్రధాని మోదీ నేడు సిక్కింలో నేరుగా పర్యటించాల్సి ఉంది. అయితే, వాతావరణం అనుకూలించని కారణంగా ఈ పర్యటన రద్దైంది. దీంతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిక్కిం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. సాహస క్రీడలకు హబ్‌గా మారే అవకాశాలు సిక్కింకు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల సమగ్రాభివృద్ధికి తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. ‘గ్యాంగ్‌టక్ (Gangtok)లో జరుగుతున్న ఈ కార్యక్రమంలో నేను నేరుగా పాల్గొనాలనుకున్నాను. అందుకు వాతావరణం సహకరించలేదు. సిక్కిం సాహస క్రీడలకు కేంద్రంగా మారే అవకాశం ఉంది. మిగిలిన ఈశాన్య రాష్ట్రాలు కూడా ఈ దిశగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను’ అని ప్రధాని పేర్కొన్నారు.
Also Read..
Spying | పాక్‌కు గూఢచర్యం.. కాంగ్రెస్ నేత మాజీ పీఏ అరెస్ట్
Bengaluru | కదులుతున్న కారుపై ఓ జంట అసభ్యకర ప్రవర్తన.. షాకిచ్చిన పోలీసులు
Mock Drills | పాక్ సరిహద్దు రాష్ర్టాల్లో మాక్ డ్రిల్స్ వాయిదా