Spying | పాక్ కోసం గూఢచర్యం (Spying) వ్యవహారం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే పలువురు భారతీయులు అరెస్టైన విషయం తెలిసిందే. తాజాగా గూఢచర్యం అరోపణలతో కాంగ్రెస్ నేత వద్ద పనిచేసిన మాజీ పీఏని దర్యాప్తు అధికారులు అరెస్ట్ చేశారు.
రాజస్థాన్ (Rajasthan) రాష్ట్ర ఉపాధి కార్యాలయంలో పనిచేస్తున్న సకూర్ ఖాన్ మగళియార్ (Sakur Khan Mangaliya)ను సీఐడీ, ఇంటెలిజెన్స్ అధికారులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. అతడిది పాక్ సరిహద్దుల్లోని జైసల్మేర్ జిల్లా బరోడా గ్రామం. పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐకి ఆయన కీలక సమాచారం చేరవేస్తున్నారన్నది ప్రధాన ఆరోపణ. ఆయన ఇటీవలే ఆరు నుంచి ఏడుసార్లు పాక్‌కు వెళ్లి వచ్చినట్లు కూడా అధికారులు గుర్తించారు.
పాకిస్థాన్ రాయబార కార్యాలయ అధికారితో, పాక్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ)తో అతనికి సంబంధాలు ఉన్నాయని అధికారులకు సమాచారం అందింది. దీంతో నిఘా సంస్థలు కొంతకాలంగా అతనిని గమనిస్తున్నాయి. ‘సకూర్ అనుమానాస్పద కార్యకలాపాల గురించి ఉన్నత స్థాయి నుంచి మాకు సమాచారం అందింది. ఆ సమాచారాన్ని నిర్ధారించుకుని, ప్రశ్నించేందుకే అతడిని అరెస్ట్ చేశాం’ అని ఎస్పీ సుధీర్ చౌధ్రీ మీడియాకు తెలిపారు. కాగా, సకూర్ ఖాన్ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మాజీ మంత్రి అయిన షేల్ మొహమ్మద్‌కు వ్యక్తిగత సహాయకుడిగా (Congress leader ex aid)పనిచేశాడు. మొహమ్మద్, ఖాన్ ఒకే గ్రామానికి చెందినవారు. దీంతో ఈ వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
Also Read..
Bengaluru | కదులుతున్న కారుపై ఓ జంట అసభ్యకర ప్రవర్తన.. షాకిచ్చిన పోలీసులు
Dharavi: ధారావి రీడెవలప్మెంట్ మాస్టర్ ప్లాన్‌కు మహాసర్కారు ఆమోదం
Mock Drills | పాక్ సరిహద్దు రాష్ర్టాల్లో మాక్ డ్రిల్స్ వాయిదా