Mock Drills | భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో సరిహద్దు రాష్ర్టాలైన గుజరాత్, పంజాబ్, రాజస్థాన్, హర్యాణా, జమ్ము కశ్మీర్లో నేడు మాక్ డ్రిల్స్ (Mock Drills) నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఆ మాక్ డ్రిల్స్ వాయిదా పడ్డాయి (mock drill postponed). ఆపరేషన్ షీల్డ్ పేరుతో నిర్వహించాల్సిన ఈ మాక్ డ్రిల్స్‌ను కేంద్ర హోం శాఖ ఆదేశాలతో వాయిదా వేసినట్లు హర్యాణా ప్రభుత్వం వెల్లడించింది. పరిపాలనా కారణాల వల్ల ఈ మాక్ డ్రిల్స్ వాయిదా వేస్తున్నట్లు రాజస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది. త్వరలో కొత్త తేదీలను ప్రకటిస్తామని తెలిపింది. ఇక జూన్ 3న మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నట్లు పంజాబ్ వెల్లడించింది.
ఇదిలా ఉండగా పహల్గాం ఉగ్రదాడి అనంతరం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రభుత్వం మే 7-8 తేదీల్లో దేశవ్యాప్తంగా సెక్యూరిటీ మాక్‌డ్రిల్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలతో దేశవ్యాప్తంగా 244 జిల్లాలో సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్స్ నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖపట్నం, అలాగే కశ్మీర్, గుజరాత్, హర్యాణా, అస్సాం వంటి రాష్ట్రాల్లో ఈ డ్రిల్స్ జరిగాయి. యుద్ధ పరిస్థితుల్లో ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి అవగాహన కల్పించడం ఈ డ్రిల్స్ లక్ష్యంగా అధికారులు పేర్కొన్నారు. 7వ తేదీ తర్వాత జరిగిన సైనిక ఘర్షణల కాలంలో సరిహద్దు రాష్ర్టాలపైనే పాకిస్థాన్ వైపు నుంచి కాల్పులు జరిగాయి. కంట్రోల్ రూముల నిర్వహణ, వైమానిక దాడుల హెచ్చరిక వ్యవస్థల పనితీరును మాక్ డ్రిల్ సందర్భంగా పరీక్షిస్తారు.
Also Read..
Lashkar-e-Taiba | షోపియాన్‌లో ఇద్దరు లష్కరే ఉగ్రవాదులు అరెస్ట్..
Corona | మళ్లీ కోరలు చాస్తున్న కరోనా.. ప్రస్తుత వ్యాక్సిన్లు నిరోధిస్తాయా?
Ganapathi | మళ్లీ గణపతి రంగ ప్రవేశం?.. మావోయిస్టులకు అధిపతిగా బాధ్యతలు?