Corona | న్యూఢిల్లీ, మే 28: ఆరేండ్ల క్రితం తొలిసారి ప్రపంచవ్యాప్తంగా విజృంభించిన కొవిడ్-19 మహమ్మారి ఇప్పుడు మళ్లీ కోరలు చాస్తున్నది. ఇప్పటికే భారత్ సహా ఆసియాలోని పలు ప్రాంతాల్లో, అమెరికాలో కొవిడ్ ఇన్ఫెక్షన్లు పెరిగాయి. భారత్లో వెయ్యికిపైగా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి.
ప్రస్తుతం భారత్లో ఒమిక్రాన్ ఉప వేరియంట్ ఎన్బీ 1.8.1తోపాటు ఎల్ఎఫ్.7, ఎక్స్ఎఫ్జీ, జేఎన్.1 రకాల వైరస్ జాతులు వ్యాప్తి చెందుతున్నాయి. ఇతర శ్వాసకోశ వైరస్ల మాదిరిగా ‘సార్స్-కోవ్-2’ కూడా ఉత్పరివర్తనాల వల్ల కాలానుగుణంగా ఇన్ఫెక్షన్ల పెరుగుదలకు కారణమవుతున్నప్పటికీ ప్రస్తుతం భారత్లో అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు ఈ వేరియంట్లను నిరోధించేందుకు అనుకూలంగా లేవని స్పష్టమవుతున్నది.