ముంబై: ఆసియాలోని అతిపెద్ద మురికివాడ ముంబైలోని ధారావి(Dharavi)ని ఆధునీకరించేందుకు మాస్టర్ ప్లాన్‌ను మహారాష్ట్ర సర్కారు ఆమోదించింది. ధారావి పరిరక్షణ, సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ఆ ప్రణాళిక అమలు చేయనున్నారు. రీడెవలప్మెంట్ ప్రక్రియ నేపథ్యంలో ధారావి సామాజిక, సాంస్కృతిక గుర్తింపునకు ఎటువంటి నష్టం ఉండదని ప్రభుత్వం చెప్పింది. ధారావి పునర్ నిర్మాణం ప్రాజెక్టును నవభారత్ మెగా డెవలపర్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థకు అప్పగించారు. సీఎం ఫడ్నవీస్ నేతృత్వంలో జరిగిన మీటింగ్‌లో ఈ ప్లాన్‌కు అప్రూవల్ చేశారు. అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రి ఏకనాథ్ షిండేతో పాటు ధారావి రీడెవలప్మెంట్ ప్రాజెక్టు సీఈవో ఎస్వీఆర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.