Bengaluru | గత కొన్నిరోజులుగా యువత రెచ్చిపోతున్నారు. పబ్లిక్‌గానే హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. బైక్, కారులో ప్రయాణిస్తూ చుట్టూ ఎవరున్నారనేది కూడా చూడకుండా.. అదేదో ఫ్యాషన్ అన్నట్లు నడిరోడ్డుపై పబ్లిక్‌గానే రొమాన్స్ చేస్తూ వార్తల్లోకెక్కుతున్నారు. ఇలాంటి ఘటనలు ఉత్తరాదిన ఎక్కువగా చోటు చేసుకున్నాయి. ఏపీ, తెలంగాణలోనూ వెలుగుచూశాయి. తాజాగా ఈ సంస్కృతి కర్ణాటకకు పాకింది.
ఓ జంట (couple) బెంగళూరు నగర రోడ్లపై రాత్రిపూట అసభ్యకరంగా ప్రవర్తించారు (indecent behaviour). కదులుతున్న కారు సన్‌రూఫ్ (car sunroof) నుంచి బయటకు వచ్చి హద్దులు మీరి ప్రవర్తించారు. ఈ ఘటన ట్రినిటీ రోడ్డులో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. అదే సమయంలో అటుగా వెళ్తున్న వాహనదారులు ఈ తతంగాన్నంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. దీనిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. వీడియో ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. నంబర్ ప్లేట్ ఆధారంగా ఆ జంటను గుర్తించారు. వారికి రూ.1,500 ఫైన్ వేశారు. ఇందులో ప్రమాదకరంగా కారును డ్రైవ్ చేసినందుకు రూ.వెయ్యి కాగా, పబ్లిక్ ట్రాఫిక్ రూల్స్‌ను పాటించని కారణంగా రూ.500 ఫైన్‌గా వేశారు.
Also Read..
Mock Drills | పాక్ సరిహద్దు రాష్ర్టాల్లో మాక్ డ్రిల్స్ వాయిదా
US Visas: చైనీస్ విద్యార్థుల వీసాలపై ఫోకస్ పెట్టిన అమెరికా
Lashkar-e-Taiba | షోపియాన్‌లో ఇద్దరు లష్కరే ఉగ్రవాదులు అరెస్ట్..