న్యూఢిల్లీ, మార్చి 2: లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్ సరికొత్త మాడల్‌ను దేశీయ మార్కెట్‌కు పరిచయం చేసింది. వీ-క్లాస్ పేరుతో విడుదల చేసిన ఈ కారు పెట్రోల్, డీజిల్ రకం ధర రూ.1.40 కోట్లుగా నిర్ణయించింది. ఆరుగురు కూర్చోవడానికి వీలుండే విధంగా డిజైన్ చేసిన ఈ వీ-క్లాస్ రకం తొలిసారిగా పెట్రోల్ ఇంజిన్‌తో రూపొందించింది. భద్రతా ప్రమాణాలు మెరుగుపర్చడంలో భాగంగా ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు, యాక్టివ్ డిస్టేన్స్ అసిస్ట్ డిస్ట్రానిక్, యాక్టివ్ లేన్ కీపింగ్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ అసిస్ట్ 360 డిగ్రీల కెమెరా, డ్రైవింగ్ సైడ్ మరో కెమెరా, 12.3 ఇంచుల డిజిటల్ డిస్ప్లే, ఎలక్ట్రానిక్ స్టేబిలిటీ కంట్రోల్, వంటి ఫీచర్స్‌తో రూపొందించింది. రూ.5 లక్షలు చెల్లించి ఈ కారును దేశవ్యాప్తంగా ఉన్న కంపెనీ డీలర్ల వద్ద బుకింగ్ చేసుకోవచ్చునని సూచించింది.