Navy plane Crashes | దక్షిణ కొరియా (South Korea)లో ఘోర ప్రమాదం సంభవించింది. పోహాంగ్ నగరంలోని సైనిక స్థావరం సమీపంలో పర్వత ప్రాంతంలో సౌత్ కొరియా నావికాదళ గస్తీ విమానం కుప్పకూలిపోయింది (Navy plane Crashes). ప్రమాద సమయంలో అందులో నలుగురు ఉన్నట్లు స్థానిక మీడియా నివేదించింది.
స్థానిక కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం 1:50 గంటల సమయంలో P-3 విమానం కూలిపోయినట్లు నావికాదళం (South Korean navy) ధృవీకరించింది. అయితే, ప్రమాదానికి గల కారణాలను మాత్రం తెలియరాలేదు. ప్రమాదం అనంతరం కొండ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున పొగలు వ్యాపించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాద సమయంలో అందులో నలుగురు సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలను మాత్రం వెల్లడించలేదు.
Also Read..
US Court | అధ్యక్షుడికి సుంకాలు విధించే అధికారాల్లేవ్.. కోర్టులో ట్రంప్‌కు భారీ ఎదురుదెబ్బ
Muhammad Yunus | బంగ్లాదేశ్‌లో ఎన్నికలు ఎప్పుడో చెప్పిన మహమ్మద్ యూనస్
US Visas: చైనీస్ విద్యార్థుల వీసాలపై ఫోకస్ పెట్టిన అమెరికా