US Court | రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ‘లిబరేషన్ డే’ పేరుతో ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలపై భారీస్థాయిలో సుంకాలు విధించారు (Trump Tariffs). అయితే, ఈ సుంకాల విషయంలో అధ్యక్షుడు ట్రంప్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ట్రంప్ టారిఫ్‌లు (Trump Tariffs) అమలుకు యూఎస్ ట్రేడ్ కోర్టు (US Court) బ్రేకులు వేసింది. టారిఫ్‌లు విధించే అధికారాలు ట్రంప్‌కు లేవని తేల్చి చెప్పింది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అంతర్జాతీయ అత్యయిక ఆర్థిక అధికారాల చట్టం కింద అధ్యక్షుడికి ప్రపంచదేశాలపై ఆర్థిక ఆంక్షలు విధించే అధికారం ఉంటుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. విచారణ సమయంలో ‘భారత్-పాక్ ఉద్రిక్తతల (India-Pakistan Tensions)’ అంశాన్ని ట్రంప్ సర్కారు ప్రస్తావించగా.. కోర్టు దాన్ని తోసిపుచ్చింది.
అధ్యక్షుడికి ఉన్న టారిఫ్ అధికారాలను సమర్థించాలని ట్రంప్ (Donald Trump) అడ్మినిస్ట్రేషన్ న్యాయస్థానాన్ని అభ్యర్థించింది. చట్టపరంగా ఎదురైన ఈ సవాల్.. చైనాతో వాణిజ్య సంధిని మార్చేస్తుందని, భారత్-పాక్ మధ్య ఘర్షణలను పెంచుతుందని అధికారులు వాదించారు. ‘‘టారిఫ్ అధికారం వల్లనే ఇటీవల భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని (India-Pak Ceasefire Argument) ట్రంప్ సాధించగలిగారు’’ అని కోర్టుకు తెలిపారు. సుంకాలకు సంబంధించి ప్రస్తుతం అనేక దేశాలతో చర్చలు జరుగుతున్నాయని ట్రంప్ సర్కారు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది. ఈ ట్రేడ్ డీల్స్‌ను ఖరారు చేసుకునేందుకు జులై 7 వరకు గడువు ఉందని, అప్పటివరకు దీన్ని చాలా సున్నితమైన అంశంగా పరిగణించాలని కోర్టును కోరింది. అయితే ట్రంప్ అడ్మిస్ట్రేషన్ చేసిన అన్ని వాదనలను కోర్టు తిరస్కరించింది.
Also Read..
Muhammad Yunus | బంగ్లాదేశ్‌లో ఎన్నికలు ఎప్పుడో చెప్పిన మహమ్మద్ యూనస్
Elon Musk | ట్రంప్‌కు షాక్!.. డోజ్ నుంచి తప్పుకున్న ఎలాన్ మస్క్
Donald Trump | నిప్పుతో పుతిన్ చెలగాటం.. రష్యా అధ్యక్షుడిపై ట్రంప్ ఫైర్