Elon Musk | ట్రంప్‌కు షాక్!.. డోజ్ నుంచి తప్పుకున్న ఎలాన్ మస్క్
అనుకున్నదే జరిగింది. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలపై అసంతృప్తితో రగిలిపోతున్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) డోజ్ నుంచి తప్పుకున్నారు. ట్రంప్ పాలకవర్గం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
వాషింగ్టన్: అనుకున్నదే జరిగింది. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలపై అసంతృప్తితో రగిలిపోతున్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) డోజ్ నుంచి తప్పుకున్నారు. ట్రంప్ పాలకవర్గం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సామాజిన మాధ్యమం ఎక్స్‌లో ప్రకటన చేశారు. ‘అమెరికా ప్రభుత్వంలో ప్రత్యేక గవర్నమెంట్ ఉద్యోగిగా తన షెడ్యూల్ ముగిసింది. ప్రభుత్వంలో వృథా ఖర్చులు తగ్గించేందుకు తనకు అవకాశం ఇచ్చినందుకు అధ్యక్షుడు ట్రంప్‌నకు ఆయన ధన్యవాదాలు. డోజ్ మిషన్ భవిష్యత్తులో మరింత బలపడుతుంది’ అంటూ ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు.
As my scheduled time as a Special Government Employee comes to an end, I would like to thank President @realDonaldTrump for the opportunity to reduce wasteful spending.
The @DOGE mission will only strengthen over time as it becomes a way of life throughout the government.
— Elon Musk (@elonmusk) May 29, 2025
గతేడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపులో ఎలాన్ మస్క్ ప్రముఖ పాత్ర పోషించారు. భారీగా నిధులు సమకూర్చడంతోపాటు ప్రచార బాధ్యతలు కూడా పర్యవేక్షించారు. ఇందుకుగాను ట్రంప్ దేశాధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత మస్క్‌కు తన ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వ వ్యయాలను తగ్గించడానికి ఉద్దేశించిన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (DOGE) శాఖ బాధ్యతలను ఆయన చేతికిచ్చారు.
దీంతో ఆయన ప్రభుత్వ శాఖల్లో భారీగా ఉద్యోగాల తొలగింపు చేపట్టడంతోపాటు వృధా ఖర్చులకు కత్తేర వేయడం ద్వారా ప్రభుత్వానికి భారీగా నిధులను మిగిల్చారు. అయితే ట్రంప్ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ఓ బిల్లును మస్క్ వ్యతిరేకించారు. ఈ బిల్లుకు అధిక బడ్జెట్ కేటాయించాల్సి వస్తుండడం వల్ల.. ప్రభుత్వ ఖర్చులు తగ్గించాలనే డోజ్ ఆశయాలకు గండి కొడుతుందన్నారు. ఈ నిర్ణయంతో డోజ్ తీసుకున్న చర్యలు వృథా అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించడం గమనార్హం.
కాగా.. అమెరికా చట్టాల ప్రకారం ఏ వ్యక్తికీ వరుసగా 130 రోజులకు మించి ఈ హోదాను ఇవ్వకూడదు. ఈ లెక్కల ప్రకారం మే 30తో మస్క్ గడువు పూర్తికానుంది. దీని ప్రకారమే మస్క్ తన బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. అయితే, మస్క్ వైదొలిగినప్పటికీ డోజ్ తన పనిని కొనసాగిస్తోందని ట్రంప్ గతంలోనే తెలిపారు. క్యాబినెట్ సెక్రటరీలు దీని బాధ్యతలు నిర్వహిస్తారని వెల్లడించారు. అయితే అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవమైన 2026 జూలై 4వ తేదీలోపు ఫెడరల్ బ్యూరోక్రసిని మొత్తం డోజ్ ప్రక్షాళన చేయాల్సి ఉంది. ఆ తర్వాత డోజ్ కాలపరిమితి దానికదే ముగియనుంది. మస్క్ తప్పుకోవడంతో డోజ్‌కు ట్రంప్ కొత్త సారథిని నియమిస్తారా లేదా ఆ వ్యవస్థను మొత్తమే రద్దు చేస్తారా అనే చూడాల్సి ఉంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసి రిలీజ్‌పై మళ్లీ సస్పెన్స్.. రాజమౌళి ఒక్క మాటతో ఫ్యాన్స్‌లో కొత్త టెన్షన్!
Naveen Polishetty | నవీన్ పొలిశెట్టిపై అభిమానుల అసహనం.. ఇంతకాలం సైలెన్స్ వెనుక కారణమేంటి?
Ind vs Nz | అదరగొట్టిన ఆకాశ్ దీప్.. న్యూజిలాండ్ 356 ఆలౌట్, ఐదు వికెట్లతో చెలరేగిన భారత పేసర్
High Court | షెడ్డులేని కంపెనీకి 500 కోట్ల రుణమా.. ఎస్బీఐ తీరుపై విస్తుపోయిన హైకోర్టు?
Revanth Reddy | రేవంత్‌ను లెక్కచేయని అధికారులు.. కాళోజీ కళాక్షేత్రంపై సీఎం ఆదేశాలేవీ పట్టనట్టే.. ఇంకా అక్కడే కుడా సిబ్బంది!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

