Praja vani | మేడ్చల్ కలెక్టరేట్, మే 26 : ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని మేడ్చల్ అడిషనల్ కలెక్టర్ విజయేందర్ రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 76 ఫిర్యాదులు వచ్చాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు సమర్పించిన అర్జీలను అడిషనల్ కలెక్టర్ విజయేందర్ రెడ్డి డీఆర్వో హరిప్రియతో కలిసి స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రజావాణిని నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజల అర్జీలపై సంబంధిత శాఖల జిల్లా అధికారులు తక్షణమే స్పందిస్తూ వాటిని వెంట వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో లా ఆఫీసర్ చంద్రావతి, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Nakirekal : తీవ్ర సంక్షోభంలో ప్రభుత్వ పాఠశాల విద్య : మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
Godavarikhani | కాళేశ్వరం పుష్కరాల సేవలో భ్రమరాంభిక సేవకులకు ప్రశంసలు