Narsapur Municipality | నర్సాపూర్, జూన్ 3 : నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ వెంకటేశ్వర కాలనీ సమస్యల నిలయంగా మారింది. కాలనీలో త్రాగునీరు, విద్యుత్, కుంట అలుగు పారే కాలువ, మురుగు నీరు సమస్యలతో కాలనీ వాసులు విసిగి వేసారిపోయారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ కాలనీ వాసులు వివిధ శాఖల అధికారులకు మంగళవారం వినతి పత్రాలను అందజేశారు.
కాలనీలో త్రాగునీటి, మురుగు నీటి సమస్య విపరీతంగా ఉందని మున్సిపల్ మేనేజర్ మధుసూదన్‌కు వినతి పత్రం అందజేశారు. అలాగే కాలనీ సమీపంలోని కోమటికుంట అలుగు పారే కాలువ కోసం తహసీల్దార్, నీటిపారుదల శాఖ అధికారులకు వినతి పత్రం అందజేశారు. కాలనీలో విధ్యుత్ సమస్యను పరిష్కరించాలని ఏడిఈ రామ్‌రెడ్డికి వినతి పత్రం అందజేశారు.
కాలనీలోని సమస్యలను పరిష్కరించాలని కాలనీ వాసులు అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు, ఉపాధ్యక్షుడు శంకర్‌నాయక్, కోశాధికారి అశోక్ కాలనీవాసులు పాల్గొన్నారు.
Crocodile | గద్వాలలో అర్ధరాత్రి కలకలం.. ఇండ్ల మధ్యకు వచ్చిన మొసలి
Electric Vehicles | రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల జోరు.. రెండు లక్షలు దాటిన ఈవీలు
Mongolia | విశ్వాసం కోల్పోయి.. మంగోలియా ప్రధాని రాజీనామా