MLA Bandari Lakshma Reddy | చర్లపల్లి, జూలై 7 : నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. కాప్రా సర్కిల్, చర్లపల్లి డివిజ్న్ పరిధిలోని చర్లపల్లి ప్రాధమిక పాఠశాలలో జిల్లా వాసవి మిత్ర మండలి ఆధ్వర్యంలో విద్యార్థులకు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి నోట్‌బుక్స్, వివిధ సామాగ్రిని పంపణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా వాసవి మిత్ర మండలి పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని, పేదల సంక్షేమానికి కృషి చేయడం హర్షనీయమన్నారు. అనంతరం వాసవి మిత్ర మండలి ప్రతినిధులు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిని సన్మానించారు.
ఈ కార్యక్రమంలో వాసవివాత్ర మండలి అధ్యక్ష, కార్యదర్శులు పెద్ది నాగరాజుగుప్తా. రెబిల్లి శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయురాలు నందిని, ప్రతినిధులు రాముని తిరుమల్లేశ్, గంప కృష్ణ, అమర కృష్ణ, అనుముల నర్సింగ్‌రావు, నగేశ్, శ్రావణ్కమార్, ముత్యాలు, శ్రీనివాస్, చందా సంతోష్, కూర శ్రీనివాస్, మురళి, వీబీవీ.కృష్ణ, నాగేశ్వర్రావ, హనుమంత్‌రావు, రామచంద్రా, తారకేశ్వర్, భగవాన్, కైలాసం, సంతోష్, శ్రీనివాస్, జగదీష్, నాగరాజు, తాటి శ్రీనివాస్, నవీన్, అరుణ్, శివ, గిరిబాబు, నేమూరి మహేశ్‌గౌడ్, ఎంకిరాల నర్సింహ్మ, లక్ష్మినారాయణ, బాల్‌రాజు, రవి తదితరులు పాల్గొన్నారు.
Mahankali Brahmotsavalu | ఈనెల18 నుంచి మహంకాళి అమ్మవారి బ్రహ్మోత్సవాలు
లేబర్‌కార్డు దారులకు రక్త నమూనాలు.. 20 వరకు సీహెచ్‌సీలో పరీక్షలు
Indiramma Indlu | ఇందిరమ్మ ఇండ్లపై తీవ్ర జాప్యం.. పునాదులకే పరిమితమైన నమూనా ఇళ్లు