Slot Booking | బోడుప్పల్, డిసెంబర్4 : నాటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కళకళలాడిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు నేడు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. పాలకుల అవగాహనా రాహిత్యం.. అధికారుల నిర్లక్ష్యంతో భూక్రయ విక్రయదారుల అవస్థలు వర్ణణాతీతంగా మారాయి. రిజిస్ట్రేషన్ పక్రియను వేగవంతం చేసి సమయాన్ని ఆదా చేయడం, పారదర్శకత పెంచడమే లక్ష్యంగా తీసుకువచ్చిన విధానం పూర్తిగా విఫలం అయినట్లు వినియోగదారులు విమర్శిస్తున్నారు.
గత సర్కార్ హయాంలో ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రోజుకు వందకుపైగా జరిగే రిజిస్రేషన్ల పక్రియను కాంగ్రెస్ సర్కార్ 48 స్లాట్ బుకింగ్ రిజిస్ట్రేషన్లు, వాక్ ఇన్ రిజిస్ట్రేషన్లను 5కు కుదించడంతో భూక్రయవిక్రయదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సర్వర్లు మొరాయించడం..కేవైసీ సమస్య, దళారుల ప్రమేయంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడటంలోపాటు వినియోగదారులు రోజుల తరబడి రిజిస్ట్రేషన్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సివస్తుంది.
15 గ్రామాలు రోజుకు 48 రిజిస్ట్రేషన్లే..
బోడుప్పల్ పరిధిలోని రెవిన్యూ భూముల క్రయవిక్రయాలతో పాటు చుట్టుప్రక్కల 15 గ్రామాల క్రయవిక్రయాలు 2007 అక్టోబర్ 1 నుండి నారపల్లి సబ్‌రిజిస్ట్రేషన్ కార్యాలయంలో జరుగుతున్నాయి. రోజుకు 48 స్లాట్ బుకింగ్ చేసిన వారికి మాత్రమే రిజిస్ట్రేషన్లు చేయడంతో మిగతా వినియోగదారులు వెనుదిరుగుతున్నారు. మౌలిక వసతులు, పార్కింగ్ సౌకర్యం లేక వినియోగదారులు అవస్థలు పడుతున్నారు.
ప్రభుత్వానికి భారీగా నిధులు సమకూర్చే రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఇరుకు ప్రదేశాల్లో అద్దె భవనాలలో నిర్వహించడం పట్ల వినియోగదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. స్లాట్ బుకింగ్ సంఖ్యను రెట్టింపు చేస్తూ.. సాంకేతిక సదుపాయాలను మెరుగుపరిచి వినియోగారుల క్రయవిక్రయ ప్రక్రియను సరళీకృతం చేస్తూ.. సిబ్బంది కొరతపై రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ ఐజీ రాజీవ్‌గాంధీ హన్మంత్ దృష్టి సారించాల్సిందిగా భూ క్రయవిక్రయదారులు కోరుతున్నారు.
Ilayaraja | ఇళయరాజా పాటల వివాదం.. రూ.50 లక్షలతో మైత్రీ మూవీస్ సెటిల్మెంట్.!
Sobhita Dhulipala | మొదటి వివాహ వార్షికోత్సవం.. స్పెషల్ వీడియో షేర్ చేసిన అక్కినేని కోడలు
Thudarum | మలయాళ బ్లాక్‌బస్టర్ ‘తుడరుమ్’ రీమేక్‌లో అజయ్ దేవగణ్ ?