SFI | దుండిగల్, ఏప్రిల్ 1: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కోవడం సిగ్గుచేటు అని ఎస్ఎఫ్ఐ మేడ్చల్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ భగత్ అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరుకు నిరసనగా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి, ప్రగతి నగర్లోని మూడు కోతుల బొమ్మల చౌరస్తా వద్ద ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రికి పాలన చేతకాక పోవడంతో ప్రభుత్వ భూములను విక్రయించాలని నిర్ణయించడం దురదృష్టకరమన్నారు. అందులో భాగంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని 400 ఎకరాలను స్వాధీనం చేసుకొని.. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకోవడం సిగ్గుచేటు అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం డౌన్ డౌన్..
కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులతో, విద్యావ్యవస్థతో చెలగాటమాడుతుందని మండిపడ్డారు. విద్యార్థులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాగించలేదని సీఎం రేవంత్ రెడ్డి గుర్తించాలన్నారు. సీఎం తన వైఖరి మార్చుకొని హెచ్సీయూ భూములను ఆక్రమించుకోవడం మానుకోవాలని.. భూముల ఆక్రమణతో పర్యావరణం దెబ్బతింటుందన్న విషయాన్ని ఆయన గ్రహించాలన్నారు. ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మానుకోకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం డౌన్ డౌన్… రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినదించారు. విద్యార్థుల జీవితంతో చెలగాటమాడుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో పౌర సమాజం మద్దతు తెలిపాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మేడ్చల్ జిల్లా కమిటీ సభ్యులు నందీశ్వర్, బాచుపల్లి మండల కమిటీ సభ్యులు రాజేష్, వాసు, శివ, సిద్ధార్థ్, చందు ,అజయ్ తదితరులు పాల్గొన్నారు.
Caste census funds | కుల గణన నిధులు విడుదల చేయాలని కలెక్టర్కు లేఖ
Gas Leak | ట్యాంకర్ నుంచి నైట్రోజన్ గ్యాస్ లీక్.. ఫ్యాక్టరీ ఓనర్ మృతి.. 40 మంది ఆస్పత్రిపాలు..!
Firecracker Factory | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. ముగ్గురు మృతి