అటవీ సిబ్బందికి అందని కార్పొరేట్ వైద్యం.. చెల్లని ప్రభుత్వ ఆరోగ్య కార్డులు
రాష్ట్రంలోని అటవీ శాఖ ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన ఆరోగ్య కార్డులు ఎక్కడా చెల్లడం లేదు. వాటిని ఏ ప్రైవేట్ దవాఖానలు అంగీకరించడం లేదు. ఆ ఆరోగ్య కార్డులపై వైద్య సేవలు అందించబోమని, డబ్బులు చెల్లిస్తే వైద్యం మొదలు పెడుతామని కార్పొరేట్ దవాఖానలు కరాకండిగా చెప్తున్నాయి.
- డబ్బు చెల్లిస్తేనే వైద్యం చేస్తామంటున్న దవాఖానలు
- వైద్య ఖర్చులు భరించలేక అల్లాడిపోతున్న ఉద్యోగులు
- సగం ఖర్చులే రీయింబర్స్ చేస్తున్న బీమా కంపెనీలు
హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని అటవీ శాఖ ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన ఆరోగ్య కార్డులు ఎక్కడా చెల్లడం లేదు. వాటిని ఏ ప్రైవేట్ దవాఖానలు అంగీకరించడం లేదు. ఆ ఆరోగ్య కార్డులపై వైద్య సేవలు అందించబోమని, డబ్బులు చెల్లిస్తే వైద్యం మొదలు పెడుతామని కార్పొరేట్ దవాఖానలు కరాకండిగా చెప్తున్నాయి. దీంతో వైద్య ఖర్చులు భరించలేక అల్లాడిపోతున్నామని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, సెక్షన్ ఆఫీసర్లు, క్షేత్రస్థాయి అటవీ సిబ్బంది వాపోతున్నారు. వారికి ఆరోగ్య బీమా పథకాన్ని వర్తింపజేస్తున్నప్పటికీ దీని వల్ల వైద్య ఖర్చులన్నీ ముందుగానే చెల్లించాల్సి వస్తున్నది.
అందులో 40-50% సొమ్మును మాత్రమే బీమా కంపెనీలు రీయింబర్స్ చేస్తున్నాయి. దీంతో అటవీ శాఖ ఉద్యోగులు అన్ని విధాలుగా నష్టపోతున్నారు. ఈ సమస్యను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, కనీసం అటవీ శాఖ మంత్రి కూడా ఈ సమస్య పరిష్కారంపై దృష్టి సారించడం లేదని తెలంగాణ బీట్ ఆఫీసర్ల సంఘం రాష్ట్ర నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే చొరవ చూపి ఆరోగ్య కార్డులు చెల్లుబాటయ్యేలా చూడాలని ఆ సంఘం నాయకుడు నాగేంద్రబాబు డిమాండ్ చేశారు. లేకుంటే ప్రభుత్వంపై పోరుకు కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srinivas Goud | హాస్టళ్ల మూసివేత నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
నాగుల చవితి వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ ఫలాలు పక్కదారి!
‘చిరుధాన్యాల సాగుపై రైతులు దృష్టి సారించాలి’
తీన్మార్ మల్లన్న కాన్వాయ్‌కు ప్రమాదంలో భార్య మృతి, భర్త పరిస్థితి విషమం
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

