నల్లబెల్లి, ఏప్రిల్ 01 : కులగణన గౌరవ వేతనం నిధులు విడుదల చేయాలని తెలంగాణ ఉద్యమకారుడు, దళిత విద్యావంతుల వేదిక జిల్లా కార్యదర్శి బట్టు సాంబయ్య వరంగల్ జిల్లా కలెక్టర్కు లేఖ రాశారు. ఈ మేరకు నల్లబెల్లి మండల కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్ ద్వారా తన లేఖను జిల్లా కలెక్టర్ కు పంపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుల గణన సర్వేలో పాల్గొన్న ప్రభుత్వ అధికారులైన సూపర్వైజర్లకు రూ.12000, ఎనెమ్యురేటర్లకు రూ.10 వేలు, ప్రభుత్వ కంప్యూటర్ ఆపరేటర్లకు ఒక్కో ఫామ్ ఆన్లైన్ చేస్తే రూ.15, ప్రైవేట్ కంప్యూటర్ ఆపరేటర్లకు రూ.30 చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు.
అయితే కుల గణన పూర్తయి ఐదు నెలలు గడుస్తున్నప్పటికీ కుల గణనలో పాల్గొన్న అధికారులకు కంప్యూటర్ ఆపరేటర్లకు రేవంత్ సర్కార్ నిధులను విడుదల చేయలేదని తెలిపారు. తక్షణమే కుల గణనలో పాల్గొన్న అధికారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కుల గణన నిధులను విడుదల చేయాలని లేఖలో పేర్కొన్నట్లు ఆయన పేర్కొన్నారు.