Firecracker Factory | గుజరాత్ (Gujarat)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బనస్కాంత (Banaskantha) జిల్లాలోని ఓ బాణసంచా కర్మాగారం (Firecracker Factory)లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు.
దీసా (Deesa) పట్టణానికి సమీపంలో ఉన్న బాణసంచా కర్మాగారంలో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ పేలుడు కారణంగా కర్మాగారంలోని కొంత భాగం కూలిపోయినట్లు ఇన్స్పెక్టర్ విజయ్ చౌదరి తెలిపారు. ఈ ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోగా.. ఆరుగురు గాయపడ్డారు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది శిథిలాల కింద చిక్కుకుపోయిన కార్మికులను రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సివిల్ ఆసుపత్రికి తరలించినట్లు జిల్లా పరిపాలన అధికారి ఒకరు తెలిపారు.
Also Read..
Gas Leak | ట్యాంకర్ నుంచి నైట్రోజన్ గ్యాస్ లీక్.. ఫ్యాక్టరీ ఓనర్ మృతి.. 40 మంది ఆస్పత్రిపాలు..!
Kathua Combing Operation: కథువాలో కూంబింగ్ ఆపరేషన్.. ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య కాల్పులు
Bajinder Singh | అత్యాచారం కేసు.. పాస్టర్ బాజీందర్ సింగ్కు జీవితఖైదు