Bajinder Singh | అత్యాచారం కేసు.. పాస్టర్ బాజీందర్ సింగ్‌కు జీవితఖైదు
Bajinder Singh | అత్యాచారం కేసులో సెల్ఫ్ స్టైల్డ్ క్రిస్టియన్ పాస్టర్ (Self-styled Christian paster) బాజిందర్ సింగ్ (Bajinder Singh)కు పంజాబ్ కోర్టు (Punjab court) శిక్ష ఖరారు చేసింది.
Bajinder Singh | అత్యాచారం కేసులో సెల్ఫ్ స్టైల్డ్ క్రిస్టియన్ పాస్టర్ (Self-styled Christian paster) బాజిందర్ సింగ్ (Bajinder Singh)కు పంజాబ్ కోర్టు (Punjab court) శిక్ష ఖరారు చేసింది. ఆయనకు జీవిత ఖైదు (life sentence) విధిస్తూ ఇవాళ సంచలన తీర్పు వెలువరించింది.
‘యేసు యేసు ప్రాఫెట్ (Yeshu Yeshu prophet)’ గా సింగ్ పాపులర్ అయ్యాడు. బాజిందర్ సింగ్ తనపై అత్యాచారానికి పాల్పడినట్లు 2018లో పంజాబ్‌లోని జిరాక్పూర్ (Zirakpur) కు చెందిన ఓ మహిళ ఆరోపించింది. విదేశాలకు తీసుకెళ్తానని మాయమాటలు చెప్పి బాజిందర్ తనను శారీరకంగా వాడుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దాంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఆయనతోపాటు మొత్తం ఏడుగురిపై ఈ కేసులో అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసు విచారణ జరిపిన ట్రయల్ కోర్టు బాజిందర్ సింగ్‌ను నాలుగు రోజుల క్రితం దోషిగా తేల్చింది. కేసులో అభియోగాలు మోస్తున్న మిగతా ఆరుగురిని నిర్దోషులుగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇవాళ అతడికి శిక్ష ఖరారు చేసింది. బాజీందర్ సింగ్‌కు జీవితఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది.
కాగా బాజిందర్ సింగ్ తరచూ వివాదాల్లో ఉంటుంటాడు. ఇటీవల ఆయన తన కార్యాలయంలో ఓ మహిళపైన, మరో వ్యక్తిపైన దాడికి పాల్పడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వారిని చెంపలపై కొట్టడం, చేతికి ఏది దొరికితే అది విసరడం లాంటి దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. 2022లో ఓ 22 మహిళ సింగ్ తనను లైంగికంగా వేధించాడని ఆరోపించింది. 2022లోనే అనారోగ్యంతో ఉన్న ఓ మహిళను బాగుచేస్తానని చెప్పి ఆమె కుటుంబం నుంచి భారీగా డబ్బులు వసూలు చేశాడు. కానీ ఆమె మరణించింది.
Also Read..
Yogi Adityanath | మా పాఠశాలల్లో విద్యార్థులకు తమిళం, తెలుగు భాషలను బోధిస్తున్నాం : యూపీ సీఎం
Sunita Williams: హిమాలయాలు అద్భుతం: సునీతా విలియమ్స్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sonia Gandhi: ఇన్‌స్టాగ్రామ్‌లోకి సోనియా గాంధీ.. ఫాలోఅవుతున్న కాంగ్రెస్ నేతలు
Resign | టీడీపీకి భారీ షాక్ ..వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే
Mouli | న్యూస్ ఛానెల్ వాళ్లు బ్లాక్మెయిల్ చేశారు.. అనారోగ్యంతో ఉన్నా వెళ్లక తప్పలేదు: మౌళి
NZvIND: టాస్ గెలిచిన ఇండియా.. న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్
Ranabaali | మిక్స్డ్ టాక్‌ను తట్టుకుని దూసుకుపోతున్న ‘రణబాలి’.. బ్రేక్ఈవెన్ దిశగా అడుగులు!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

