Attack | కుత్బుల్లాపూర్, నవంబర్ 5 : ఓ రౌడీ షీటర్ జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని జగద్గిరిగుట్ట బస్ స్టాండ్‌లో రోషన్ అనే యువకుడిపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాల్ రెడ్డి అనే రౌడీ షీటర్, మరో దుండగుడు అందరూ చూస్తుండగానే కత్తితో రోషన్ అనే యువకుడిపై దాడి చేశారు.
ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో హత్య యత్నానికి పాల్పడినట్లుపోలీసులు అనుమానిస్తున్నారు. తీవ్ర గాయాలపాలైన యువకుడు రోషన్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. బాధితుడు రోషన్(26) సైతం బాలనగర్ పీఎస్ లో రౌడీషీటరే. హత్యాయత్నం చేసిన వ్యక్తి బాలేశ్వర్ రెడ్డి (23) జగద్గిరిగుట్ట పీఎస్ పరిధిలో రౌడీషీటర్‌గా ఉన్నాడు. బాలేశ్వర్ రెడ్డి ఫ్రెండ్ మహమ్మద్‌తో కలిసి హత్యాయత్నానికి పాల్పడ్డారు.
వీరు ముగ్గురు గంజాయి బ్యాచ్‌గా పేర్కొంటున్నారు. ఆర్థిక లావాదేవిలవల్లే ఈ హత్యాయత్నానికి దారి తీసినట్టు చెబుతున్నారు. కేసు దర్యాప్తులో మరిన్ని వివరాలు బయటకు వస్తాయని తెలిపారు. తీవ్రంగా గాయపడ్డ రోషన్ ని జగద్గిరిగుట్ట లాస్ట్ బస్టాప్‌లో గల మెడిసిటీ హాస్పిటల్‌కు తరలించి పరిస్థితి విషమించడంతో గాంధీ హాస్పిటల్‌కు తరలించినట్టు పోలీసులు వెల్లడించారు.
NIT | వరంగల్ నిట్‌లో ఉచిత ‘గేట్’ కోచింగ్
Hanumakonda | డైట్లో అతిథి అధ్యాపకులకు దరఖాస్తుల ఆహ్వానం
ISRO: జనవరిలో గగన్‌యాన్ పరీక్ష.. 2035 నాటికి స్పేస్ ల్యాబ్