NIT | వరంగల్ నిట్‌లో ఉచిత ‘గేట్’ కోచింగ్
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)లోని ఎస్సీ,ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో ఉచిత గేట్ కోచింగ్ తరగతులు నిర్వహించనున్నట్లు నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుధి తెలిపారు.
హనుమకొండ, నవంబర్ 5 : నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)లోని ఎస్సీ,ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో ఉచిత గేట్ కోచింగ్ తరగతులు నిర్వహించనున్నట్లు నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుధి తెలిపారు. ఈ కోచింగ్ వరంగల్ నిట్ విద్యార్థులతో పాటు వరంగల్ పరిసర ప్రాంతాల్లోని ఇతర ఇంజినీరింగ్ కాలేజీల విద్యార్థులకు కూడా అందుబాటులో ఉంటుందని, ఈ తరగతులు అన్ని ఇంజినీరింగ్ శాఖలకు సంబంధించినట్లు పేర్కొన్నారు. కోర్సు 8 వారాలపాటు కొనసాగుతుందని, ఈనెల 17 నుంచి జనవరి 9 వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు.
ఈ కార్యక్రమం ఇంజినీరింగ్ విద్యార్థులు గేట్ పరీక్షకు సమర్థవంతంగా సిద్ధం కావడానికి సహాయప డుతుందన్నారు. ఆసక్తిఉన్న విద్యార్థులు అప్లికేషన్ ఫారం నింపి తరగతులకు హాజరుకావచ్చని, దరఖాస్తు ఫారం, నియమాలు, నిబంధనలు, మరిన్ని వివరాలకు వరంగల్ నిట్ అధికారిక వెబ్సైట్లో నోటిఫికేషన్ విభాగాన్ని సందర్శించాలని కోరారు. ఇతర వివరాలకు విద్యార్థులు వరంగల్ నిట్ ఎస్సీ, ఎస్టీ సెల్‌ను సంప్రదించవచ్చని తెలిపారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

