హనుమకొండ, నవంబర్ 5: హనుమకొండలోని ప్రభుత్వ విద్యాశిక్షణా సంస్థ(డైట్)లో ఖాళీగా ఉన్న కళలు-కళావిద్య-1, ఫిలాసఫీ/సోషియాలజీ/సైకాలజీ-1, పెడగోజి ఆఫ్ మ్యాథమెటిక్స్-1 పోస్టులకు అతిథి అధ్యాపకులుగా(గెస్ట్ ఫ్యాకల్టీ) తాత్కాలిక విధానం ద్వారా భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్న ప్రిన్సిపాల్ ఎండీ అబ్దుల్హై తెలిపారు.
65 వయస్సులోపు ఉన్న రిటైర్డ్, నిరుద్యోగ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని, ఆసక్తిగలవారు కాలేజీలో ఇచ్చే అప్లికేషన్ ఫారంను పూర్తిచేసి ఒక ఫొటో, విద్యార్హతలకు సంబంధించిన నిజపత్రాలను జతచేసి ఈనెల 7 నుంచి 13 వరకు సమర్పించాలన్నారు. 14న తుది జాబితా ప్రకటించి మెరిట్ ప్రాతిపదికన 1:5 నిష్పత్తిలో ఈనెల 15న డెమో/ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపికైన అభ్యర్థుల జాబితా ప్రకటించబడుతుందన్నారు. ఈ జాబితా అభ్యర్థులు ఈనెల 17 నుంచి 2025-26 అకాడమిక్ సంవత్సరానికి గెస్ట్ ఫ్యాకల్టీగా డైట్ కాలేజీలో రిపోర్టు చేయాలని ప్రిన్సిపాల్ తెలిపారు.