Revenue Conferences | ఘట్ కేసర్, జూన్ 3: భూ భారతి చట్టంపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించటంతోపాటు భూ సమస్యలను సత్వరం పరిష్కరించుకునేందుకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు మేడ్చల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ విజయేందర్ రెడ్డి తెలిపారు. ఘట్ కేసర్ తహసీల్దార్ కార్యాలయం ఆవరణ, ఎదులాబాద్‌లో మంగళవారం భూ భారతి చట్టంపై అవగాహన సదస్సులు జరిగాయి.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ విజయేందర్ రెడ్డి మాట్లాడుతూ.. భూ భారతి చట్టం వల్ల భూ యజమానికి భూధార్ కార్డుతోపాటు భూనక్ష, భూ హక్కులు, భూ సమస్యల పరిష్కారం లభిస్తుందన్నారు. ఈ సదస్సును వినియోగించుకుని సమస్యలు పరిష్కరించుకోవాలని అడిషనల్ కలెక్టర్ కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ జడ్పి చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు వజ్రేష్ యాదవ్, తహసీల్ధార్ రజిని, డిప్యూటీ తహసీల్ధార్ రాజేందర్, మండల రెవెన్యూ ఇన్ స్పెక్టర్ లు కావ్య, సాయిరాం, నాయకులు, ప్రజలు మహిళలు పాల్గొన్నారు.
Crocodile | గద్వాలలో అర్ధరాత్రి కలకలం.. ఇండ్ల మధ్యకు వచ్చిన మొసలి
Electric Vehicles | రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల జోరు.. రెండు లక్షలు దాటిన ఈవీలు
Mongolia | విశ్వాసం కోల్పోయి.. మంగోలియా ప్రధాని రాజీనామా