Road Works | మేడ్చల్ కలెక్టరేట్, జూలై 8 : రోడ్డు విస్తరణ పనులను వెంటనే పూర్తి చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని నాగారం మున్సిపాలిటీ రాంపల్లిలో యువజన సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. నాగారం నుండి యంనంపేట్ వరకు, చర్లపల్లి నుండి కరీంగూడం వరకు చేపట్టిన రోడ్డు విస్తరణ పనులు నత్తనడకన, ప్రమాదకరంగా నడుస్తున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.
రోడ్డు పనులు మొదలైన నాటి నుండి 8 మంది ప్రాణాలు పోయాయని, అనేక మందికి ప్రమాదాలు జరిగాయని, ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదని విచారం వ్యక్తం చేశారు. ప్రమాదాలు జరుగకుండా, త్వరగా రోడ్డు విస్తరణ పనులను పూర్తి చేయాలని పలువురు డిమాండ్ చేశారు.
ఈ ధర్నా కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువజన సంఘాల నాయకులు, ఇస్మాయిల్ ఖాన్ గూడ, కరీం గూడ నాయకులు, వాహనదారులు, ప్రయాణికులు, వివిధ కాలనీ వాసులు పాల్గొన్నారు.
Mahankali Brahmotsavalu | ఈనెల18 నుంచి మహంకాళి అమ్మవారి బ్రహ్మోత్సవాలు
లేబర్కార్డు దారులకు రక్త నమూనాలు.. 20 వరకు సీహెచ్సీలో పరీక్షలు
Indiramma Indlu | ఇందిరమ్మ ఇండ్లపై తీవ్ర జాప్యం.. పునాదులకే పరిమితమైన నమూనా ఇళ్లు