Govt lands | దుండిగల్, జూలై 7: గండిమైసమ్మ -దుండిగల్ మండలం, దుండిగల్ తండాలోని సర్వే నెంబర్ 684 ప్రభుత్వ భూమిని కబ్జాదారుల నుంచి కాపాడాలని స్థానిక మాజీ కౌన్సిలర్ (బీఆర్ఎస్) శంకర్ నాయక్ అన్నారు. ఈ మేరకు సోమవారం తండావాసులతో కలిసి గండి మైసమ్మ- దుండిగల్ తహసీల్దార్ మతిన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్వే నెంబర్ 684 ప్రభుత్వ స్థలంలో 200 ఎకరాలను గతంలోనే నాటి ప్రభుత్వం రాంకీ సంస్థకు అప్పగించిందన్నారు.
మిగిలిన 425.25 ఎకరాల భూమి రోడ్డు ఇరువైపులా అలాగే ఉందని.. ఇటీవల భూముల విలువ పెరగడంతో ప్రభుత్వ భూములపై కన్నేసిన అక్రమార్కులు దానిని ఎలాగైనా కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. సదరు భూమి సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం, గడ్డపోతారం గ్రామం, దుండిగల్ తండా సరిహద్దులో ఉండడం కూడా కబ్జాదారులకు కలిసి వస్తుందన్నారు.
ఇప్పటికే ప్రభుత్వ భూమిని చదును చేసి ఆక్రమించేందుకు సిద్ధంగా ఉన్నారని, అధికారులు స్పందించి భూబకాసురుల నుంచి ప్రభుత్వ భూమి కాపాడి ప్రజా అవసరాలకు వినియోగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో శంకర్ నాయక్‌తోపాటు రవీందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Mahankali Brahmotsavalu | ఈనెల18 నుంచి మహంకాళి అమ్మవారి బ్రహ్మోత్సవాలు
లేబర్‌కార్డు దారులకు రక్త నమూనాలు.. 20 వరకు సీహెచ్‌సీలో పరీక్షలు
Indiramma Indlu | ఇందిరమ్మ ఇండ్లపై తీవ్ర జాప్యం.. పునాదులకే పరిమితమైన నమూనా ఇళ్లు