MLA Bandari Lakshma Reddy | చర్లపల్లి, జూలై 8 : నియోజకవర్గ పరిధిలోని కాలనీల సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం చర్లపల్లి డివిజన్, చక్రీపురం కాలనీ నూతన సంక్షేమ సంఘం కమిటీ సభ్యులు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిని కలిసి సమస్యలను వివరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఉప్పల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. చక్రీపురం కాలనీలో నెలకొన్న సమస్యలను దశలవారిగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని, ముఖ్యంగా డ్రైనేజీ సమస్యలను పరిష్కరించిన వెంటనే రహదారుల నిర్మాణం పనులు చేపడుతామని ఆయన పేర్కొన్నారు. కాలనీలో సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు.
కాలనీ సంక్షేమ సంఘం నూతన కమిటీ సభ్యులు కాలనీవాసుల భాగస్వామ్యంతో కాలనీ అభివృద్ధికి కృషి చేయాలని ఆయన సూచించారు. అనంతరం కాలనీ సంక్షేమ సంఘం నూతన కమిటీ సభ్యులు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సన్మానించారు.
ఈ కార్యక్రమంలో చక్రీపురం సంక్షేమ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు గడ్డల పాండు ముదిరాజ్, సోమసాని ఆశోక్, గౌరవ అధ్యక్షుడు రాఘవరెడ్డి, ఉపాధ్యాక్షులు కొండారెడ్డి, లాల్‌సింగ్, సంయుక్త కార్యదర్శులు భాస్కర్‌రెడ్డి, ఎర్రయ్య, కోశాధికారి జగన్మోహన్రెడ్డి, ఉప కోశాధికారి యాకయ్య, కార్యనిర్వహక కార్యదర్శులు చంద్రారెడ్డి, బ్రహ్మాచారిలతో పాటు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
Mahankali Brahmotsavalu | ఈనెల18 నుంచి మహంకాళి అమ్మవారి బ్రహ్మోత్సవాలు
లేబర్‌కార్డు దారులకు రక్త నమూనాలు.. 20 వరకు సీహెచ్‌సీలో పరీక్షలు
Indiramma Indlu | ఇందిరమ్మ ఇండ్లపై తీవ్ర జాప్యం.. పునాదులకే పరిమితమైన నమూనా ఇళ్లు