Welfare Schemes | చర్లపల్లి, జూన్ 9 : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను పేదలు సద్వినియోగం చేసుకోవాలని కాప్రా మండలం తహసీల్దార్ సుచరిత, జీహెచ్ఎంసీ స్టాడింగ్ కమిటీ సభ్యురాలు, చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవిలు పేర్కొన్నారు. చర్లపల్లి డివిజన్‌కు చెందిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌కు చెందిన 22 మంది లబ్ధిదారులకు కాప్రా కార్పొరేటర్ స్వర్ణరాజులతో కలిసి చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేదలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్ధికంగా అభివృద్ధి సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మార్కెట్ కమిటీ డైరక్టర్ నాగిళ్ల బాల్‌రెడ్డి, వివిధ విభాగాల అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Gudem Mahipal Reddy | అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి: పటాన్చెరు ఎమ్మెల్యే
Naresh | ఏడుపాయల వన దుర్గమ్మ సేవలో నరేష్..