గుమ్మడిదల, జూన్ 9: అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి (Gudem Mahipal Reddy) అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. గుమ్మడిదల మండలం, మున్సిపల్ పరిధిలోని బొంతపల్లి వీరభద్రస్వామి దేవాలయం నుంచి గుమ్మడిదల వరకు రూ.2.90 కోట్ల నిధుల అంచనా వ్యయంతో చేపట్టనున్న బీటీ రోడ్డు, అన్నారం నుంచి ఎక్స్ సర్వీస్‌మెన్ కాలనీ వరకు రూ.1.10 కోట్లతో చేపట్టనున్న బీటీ రోడ్డు, కొత్తపల్లి నుంచి నాగిరెడ్డి గూడ మీదుగా శివాయిగూడ వరకు రూ.1.80 కోట్ల నిధులతో చేపట్టనున్న బీటీ రోడ్డుకు, గుమ్మడిదల నుంచి నాగిరెడ్డిగూడ మీదుగా కొత్తపల్లి వరకు రూ.2.05 కోట్ల నిధులతో బీటీ రోడ్డు పనులకు, రామిరెడ్డి బావి నుంచి కానుకుంట వయా వీరారెడ్డిపల్లి-మొల్లగూడ వరకు రూ.2.40 కోట్ల నిధుల అంచనా వ్యయంతో బీటీ రోడ్డు పనులకు ఎమ్మెల్సీ అంజిరెడ్డితో కలిసి ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం జాతీయ రహదారి నుంచి ఎంపీడీవో కార్యాలయం వరకు రూ.45 లక్షల నిధుల వ్యయంత నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు.
అనంతరం మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వంతో చర్చించి పెద్ద ఎత్తున నిధులు కేటాయించామన్నారు. ప్రజలందరూ అభివృద్ధిలో భాగస్యాములు అయినప్పుడే సత్ఫలితాలు వస్తాయని చెప్పారు. రహదారుల నిర్మాణంలో నాణ్యతలోపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులకు సూచించారు. నిర్ధేశించిన గడువలోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈకార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కుమార్‌గౌడ్, ఆత్మకమిటీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, పంచాయతీరాజ్ డీ సురేశ్, షేక్‌హుస్సేన్, శ్రీనివాస్‌రెడ్డి, మాజీప్రజాప్రతినిధులు విజయభాస్కర్‌రెడ్డి, వీరారెడ్డి,పుట్ట నర్సింగ్‌రావు, కావలి ఐలయ్య, మహ్మద్‌హుస్సేన్, నాగేందర్ గౌడ్, ఆలేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నబోయిన వేణు, కార్యకర్తలు పాల్గొన్నారు.