Garbage fire | పోచారం, జూన్ 19 : పోచారం మున్సిపాలిటీ మున్సిపాలిటీ అన్నోజిగూడ అవుటర్ రింగ్‌రోడ్డు వద్ద చెత్తను దగ్దం చేయడంతో పోగతో ప్రయిణికులు తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నారు. పోచారం మున్సిపాలిటీ వార్డులలోని చెత్తను మున్సిపాలిటీ వాహనాల ద్వారా అవుటర్ రింగ్‌రోడ్డు టోల్‌ప్లాజా వద్ద గల కంకర మిషన్ గుంతలో డంప్ చేస్తున్నారు. అక్కడ చెత్త పేరుకపోవడంతో మున్సిపాలిటీ సిబ్బంది చెత్తను దగ్దం చేస్తున్నారు.
చెత్తను దగ్దం చేయడం వల్ల రాత్రిపగలు పొగరావడంతో పక్కనే ఉన్న టోల్‌ప్లాజా నుంచి వెళ్లే వాహనదారులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. దుర్వాసన, పొగతో ఇక్కడి నుంచి వచ్చిపోయే వాహనదారులు కళ్లు, ముక్కు మూసుకొని ప్రయాణించాల్సి వస్తుంది. దీంతో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. మున్సిపాలిటీ అధికారులు సిబ్బంది కల్పించుకొని ఇక్కడి డంప్ చేసే చెత్తను దగ్దం చేయకుండా ఎప్పటికప్పుడు జవహర్ నగర్‌కు తరలించాలని కోరుతున్నారు.
Bonakal : ‘కాంగ్రెస్ నాయకుల నుండి రక్షించండి’
GHMC | ఇదేనా స్వచ్చ సర్వేక్షన్ స్పూర్తి.. చెత్త తరలింపులో బల్డియా నిర్లక్ష్యం
Banjarahills | వర్షాకాలంలో రోడ్ల తవ్వకాలపై నిషేదానికి తూట్లు.. కమిషనర్ ఆదేశాలను తుంగలో తొక్కి పనులు