Illegal Constructions | దుండిగల్, జులై 1 : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని గాజులరామారం సర్కిల్ అక్రమ నిర్మాణాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఎక్కడ చూసినా అనుమతులు లేని నిర్మాణాలే దర్శనమిస్తుండడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తుందని స్థానికులు పేర్కొంటున్నారు. అనుమతులు లేని అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని ఓవైపు హైకోర్టు ఆదేశిస్తున్నా ఇక్కడి అధికారులు, సిబ్బందికి మాత్రం చీమ కుట్టినట్టైనా లేదని వాపోతున్నారు. అడుగడుగునా ఆక్రమణలు, అనుమతులు లేని నిర్మాణాలతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతుందంటున్నారు.
టౌన్ ప్లానింగ్ అధికారులతో సహా డీసీ వరకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు. దీంతో కిందిస్థాయి సిబ్బంది (చైన్ మెన్లు) ఆడింది ఆట, పాడింది పాటగా పరిస్థితి తయారయింది అంటున్నారు. చైన్ మెన్లు అంతా తామై అక్రమార్కులకు వంత పాడుతూ సెటిల్ మెంట్లకు పాల్పడుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో గాజులరామారం సర్కిల్ పరిధిలోని గాజుల రామారం, జగద్గిరిగుట్ట, చింతల్, సూరారం డివిజన్లలో పుట్టగొడుగుల అక్రమ నిర్మాణాలు ఎక్కడపడితే అక్కడ దర్శనమిస్తున్నాయని పలువురు పేర్కొంటున్నారు.
కొందరు అక్రమార్కులు జీ+2 అంతస్తులకు మాత్రమే అనుమతులు తీసుకొని జి+4,5 అంతస్తులు నిర్మిస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. మరికొందరు రెసిడెన్షియల్ అనుమతులు తీసుకొని, ఏకంగా వాణిజ్య సముదాయాలు నిర్మిస్తున్నా ఎటువంటి చర్యలు లేవని పేర్కొంటున్నారు. దీనికంతటికి కింది స్థాయి సిబ్బంది, చైన్ మెన్ల చేతివాటమే కారణమని ఆరోపణలు వెలుగుతున్నాయి. ఎవరైనా అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు చేస్తే అధికారులకు, నిర్మాణదారులకు మధ్యన చైన్ మెన్లు వారధిగా వ్యవహరిస్తూ సెటిల్మెంట్లకు పాల్పడుతున్నారని సర్వత్రా చర్చించుకుంటున్నారు. దీంతో ఫిర్యాదు చేసిన అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదంటున్నారు.
సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న నిర్మాణదారులతోపాటు వారికి వంట పాడుతున్న కిందిస్థాయి సిబ్బందిపై చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. గాజులరామారం సర్కిల్ పరిధిలో చోటు చేసుకుంటున్నా అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ అధికారులు దృష్టి సారించి విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.
చైన్ మెన్లదే హవా..!
గాజులరామారం సర్కిల్ పరిధిలోని నాలుగు డివిజన్లకు కొంతకాలంగా ఒక్కరే చైన్ మెన్‌గా పనిచేస్తున్నాడు. సదరు ఉద్యోగి ఇక్కడ పాతుకుపోవడంతో తరచూ బదిలీలపై వచ్చే అధికారులు అతడు చెప్పే సమాధానాలపై ఆధారపడి పని చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో అధికారులను తప్పుదోవ పట్టిస్తూ నిర్మాణదారులకు కొమ్ముకాస్తున్నట్లు తెలుస్తుంది.
Couple died | రెండు నెలల క్రితం ప్రేమ వివాహం.. సిగాచీ ఫార్మా ప్రమాదంలో దంపతులు దుర్మరణం
Chahat Bachpai | డ్రైనేజీని పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ చాహత్ బాచ్‌పాయ్
NTR Vs Hrithik Roshan | వార్ 2 సెట్స్‌లో డ్యాన్స్‌తో దుమ్ము లేపబోతున్న స్టార్ హీరోలు!