Nagaram Road Works | పోచారం, మార్చి17 : రోడ్డు విస్తరణలో భాగంగా కంకర వేశారు. కానీ బీటీ రోడ్డు వేయడం మరిచిపోయారు. దాదాపు నెల రోజులు కావస్తున్నా, బీటీ రోడ్డు వేయడక పోవడంతో ఇక్కడి దుమ్ము, కంకర రాళ్లతో వాహనాలు పడిపోయి వాహనదారులు గాయాలకు గురవుతున్నారు. నాగారం మున్సిపాలిటీ చర్లపల్లి రైల్వే టెర్మినల్ నుంచి ఇటు రాంపల్లి చౌరస్తా నుంచి పోచారం మున్సిపాలిటీ యంనంపేట్ మీదుగా వరంగల్ హైవే వరకు రోడ్డు విస్తరణ చేసి కొత్తరోడ్డును నిర్మిస్తున్నారు.
ఈ పనులు రెండు నెలలుగా కొనసాగుతున్నాయి. పోచారం మున్సిపాలిటీ ఇస్మాయిల్ ఖాన్‌గూడ, యంనంపేట్ పరిధి వరకు వచ్చాయి. రోడ్డు నిర్మాణ కాంట్రాక్టర్ సిమెంట్ కలిపిన కంకర పరిచి వదిలేశాడు. దీంతో పోచారం మున్సిపాలిటీ యంనంపేట్ నుంచి ఇస్మాయిల్ ఖాన్ గూడ, చర్లపల్లి, రాంపల్లి, ఈసీఐఎల్, కుషాయిగూడ వెళ్లే వాహనదారులు సిమెంట్ దుమ్ము, కంకర రాళ్లు ఉండడంతో వాహనాలు స్కిడ్ అవుతూ ప్రమాదాలకు గురువుతున్నారు.
కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో..
సిమెంట్ పౌడర్, కంకర వేసిన రోడ్డుపై ఎప్పటికప్పుడు నీళ్లు చల్లుతూ దుమ్ము లేకుండా జాగ్రత్తలు తీసుకొని రోడ్డు నిర్మించాల్సి ఉండగా, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో రోడ్డు నిర్మాణ పనులు ఎక్కడకక్కడ వదిలేశారు. ఈ పరిస్థితిని చక్కబెట్టాల్సిన సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. రోడ్డుపై అక్కడక్కడ నిర్మిస్తున్న కల్వర్టులను సగం వరకు ఏర్పాటు చేసి వదిలేశారు.
రోడ్డుకు రెండు వైపులా ఉన్న నీటి సరఫరా పైప్లైన్లు, డ్రైనేజీ కాలువలు రోడ్డుపై అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. సంబంధిత అధికారులు పట్టించుకొని ఈ రోడ్డు పనులను త్వరిత గతిన పూర్తి చేసి ఈ ప్రాంత వాహన దారుల ఇబ్బందులను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
Read Also :
HYDRAA | బండ్లగూడలో హైడ్రా కూల్చివేతలు
ASP Chittaranjan | విద్యార్థులు ఒత్తిడిని అధిగమిస్తేనే విజయం తథ్యం : ఏఎస్పీ చిత్తరంజన్
Harish Rao | కాంగ్రెస్ ముసుగులో ఉన్న బీజేపీ మనిషి రేవంత్: హరీశ్‌రావు