Rajiv Yuva Vikasam | రామంతాపూర్ ఏప్రిల్ 16 : రాజీవ్ యువ వికాసంలో బీసీలకు ప్రాధాన్యత కల్పించాలని కోరుతూ హబ్సిగూడ డివిజన్ బీసీ నాయకుడు కరిపె పవన్ కుమార్ ఇవాళ బీసీ కార్పొరేషన్ ఫైనాన్స్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్‌ను కోరారు. ఈ మేరకు ఆయన పలువురిని మర్యాదపూర్వకంగా కలిశారు. రాజీవ్ యువ వికాసం కార్యక్రమంలో బీసీ వర్గాలకు మరింత ప్రాధాన్యత కల్పించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలోని బీసీ యువత ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి రాజీవ్ యువ వికాసం వంటి పథకాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. అయితే ఈ పథకంలో బీసీలకు కేటాయింపులు పెంచితే మరింత మంది నిరుద్యోగ యువతకు లబ్ధి చేకూరుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.
BRS dharna | జూరాల ఆయికట్టు రైతులకు సాగునీరు విడుదల చేయాలి బీఆర్ఎస్ ధర్నా
Srinivas Goud | బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్