MLA Bandari Lakshma Reddy | రామంతాపూర్, జూన్ 19 : ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఫీజుల్లో 50 శాతం రాయితీ ఇవ్వాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు.
కార్పొరేట్ స్కూళ్లలో చదువుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థుల ఫీజుల్లో 50% వరకు రాయితీ ఇవ్వాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి విద్యా సంస్థల యాజమాన్యాలను కోరారు. గురువారం ఆయన పలు స్కూళ్లు తిరిగారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉప్పల్ నియోజకవర్గం పరిధిలో కార్మిక, పేద, మధ్యతరగతి కుటుంబాలు అధికంగా ఉంటాయన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు ఫీజుల్లో రాయితీ ఇచ్చేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలోపార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Bonakal : ‘కాంగ్రెస్ నాయకుల నుండి రక్షించండి’
GHMC | ఇదేనా స్వచ్చ సర్వేక్షన్ స్పూర్తి.. చెత్త తరలింపులో బల్డియా నిర్లక్ష్యం
Banjarahills | వర్షాకాలంలో రోడ్ల తవ్వకాలపై నిషేదానికి తూట్లు.. కమిషనర్ ఆదేశాలను తుంగలో తొక్కి పనులు