MLA Madhavaram Krishna Rao | జమ్మూ కశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పహల్గాం పట్టణ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారని తెలిసిందే. బైసరన్ ప్రాంతంలో విహారయాత్రకు వచ్చిన వారిపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా ఈ దాడి ఘటనను కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఖండించారు.
జమ్మూ కశ్మీర్లో ఉగ్రదాడి అమానుషమని, పర్యాటకులను కాల్చి చంపిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఇవాళ క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు జమ్మూ కశ్మీర్ ఉగ్రవాద దాడిలో చనిపోయిన వారికి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అమాయకమైన ప్రజలను ఉగ్రవాదులు దాడి చేసి చంపడం బాధాకరమన్నారు.
భారతదేశ ప్రతిష్టను దిగజార్చడానికి ఉగ్రవాదులు హేయమైన చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.ఉగ్రవాదులపై కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని కోరారు. ఇలాంటి సంఘటనలను పార్టీలకతీతంగా ప్రతీ ఒక్కరు ఖండించాలని కోరారు. దేశ రక్షణ కోసం పోరాడుతున్న సైనికులకు అండగా నిలవాలని కోరారు.
Errabelli Dayakar Rao | ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో బీఆర్ఎస్లో భారీగా చేరికలు
KTR | పెంబర్తి వద్ద కేటీఆర్కు ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి