ECIL | ప్రజలు వాకింగ్ చేసేందుకు ఈసీఐఎల్ గేట్‌ను తెరచి ఉంచాలని ఉప్పల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్‌ను స్థానికులు కోరారు. ఈ మేరకు వారంతా ఆయనకు వినతి పత్రం అందజేశారు. ఇవాళ మల్కాజిగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రజలు ఎన్నో ఒత్తిడిలను ఎదుర్కొనేందుకు ఉదయం, సాయంత్రం వాకింగ్ చేయడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపరుచుకునేందుకు వీలవుతుందని వినతి పత్రంలో పేర్కొన్నారు. అందుకు మాజీ ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి వీలైనంత త్వరగా ఈసీఐఎల్, ఎన్ఎఫ్సి గేట్లను ప్రజలకు అందుబాటులో ఉంచేలా కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, నాయకులు కార్యకర్తలు నవీన్ గౌడ్, రవీందర్, కంటేకర్, సంతోష్, మోహన్‌రెడ్డి, యాదగిరి, వెంకటేష్, వెంకట్, శంకర్, కిరణ్ తదితరులు ఉన్నారు.