Revanth Reddy |హనుమకొండ, ఫిబ్రవరి 20(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సీఎం రేవంత్‌కు సొంత రాష్ట్ర ప్రయోజనాల కంటే ఆయన గురువు చంద్రుబాబు మెప్పు కోసమే ఎక్కువ తపిస్తున్నారని, అందుకే గోదావరి జలాలు ఆంధ్రాకు తరలిపోయేలా గురుదక్షిణ చెల్లిస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ఎల్సీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు విమర్శించారు. గోదావరి, కృష్ణా జలాల వినియోగంలో కాంగ్రెస్ సర్కార్ తీరు రాష్ట్ర రైతులకు తీవ్ర నష్టం చేస్తున్నదని ఆగ్ర హం వ్యక్తంచేశారు. దేవాదుల ప్రాజెక్టులో భాగమైన హనుమకొండ జిల్లా దేవన్నపేట పంప్‌హౌస్‌ను శుక్రవారం ఆయన పరిశీలించి మీడియాతో మాట్లాడారు. కృష్ణా, గోదావరిలో మన నీటిని వినియోగంలో, ఏపీ జల దోపిడీని అడ్డుకోవడంలో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు.
ప్రాజెక్టుల నిర్మాణం లో, ఉన్న వాటి నిర్వహణలోనూ ఇదే పరిస్థితి ఉన్నదని పేర్కొన్నారు. దేవాదుల ప్రాజెక్టులోని అన్ని మోటార్లను నడుపాలని, మూడున్నర లక్షల ఎకరాలకు నీళ్లు అందించేలా యుద్ధప్రాతిపాదికన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేవన్నపేట పంపుహౌస్‌లోని మొత్తం మూడు మోటార్ల్లను ప్రభుత్వం ఆఫ్ చేసి పెట్టింది. 2025, మార్చి 18న నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా మంత్రులు వచ్చి మోటార్లు ఆన్ చేస్తే అవి ఆన్ కాలేదు. మోటార్లు స్టార్ట్ అయ్యేవరకు ఇకడే ఉంటామని మీడియా ముందు గాలిమాటలు చెప్పి గాలిమోటార్లు ఎక్కి వెళ్లిపోయారు’ అంటూ ఎద్దేవా చేశారు. ఆ తర్వాత వారం రోజులకు ఆన్ చేసినట్టు చెప్పారు.
రెండు రోజులకే లీకేజీ ఉన్నదని బంద్ పెట్టినట్టి ప్రకటించారని తెలిపారు. నిరుడు మోటార్లు ఆన్ చేయకపోవడం వల్ల 60వేల ఎకరాల్లో పంట ఎండిపోయిందని, ఈసారి అదే పరిస్థితి వస్తున్నదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం, ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేల నిర్లక్ష్యంతోనే రైతులు నష్టపోయారని హరీశ్‌రావు వివరించారు. బీఆర్ఎస్ పోరాటం చేస్తే 50 రోజుల తర్వాత రూ.8 కోట్లు చెల్లించి మోటార్లు ఆన్ చేశారని తెలిపా రు. సర్కార్ నిర్లక్ష్యంతో నీళ్లు అందక అప్పటికే పంటలు ఎండిపోయి ఏడెనిమిది వందల కోట్ల నష్టం జరిగిందని, ఇప్పుడు కూడా పరిస్థితి ఆందోళన కలిగిస్తున్నదని చెప్పారు. యాసంగి లో రైతులు పంటలు వేసి నీళ్లు కోసం ఎదురుచూస్తున్న సమయంలో ప్రభుత్వం మోటార్ల ను బందు పెట్టిందని మండిపడ్డారు. కాంగ్రెస్ కొత్తగా ప్రాజెక్టులు కట్టింది లేదు.. మోటార్లు పెట్టింది లేదు.. ఉన్న మోటార్లు నడుపక రైతాంగం నోళ్లు మట్టి కొడుతున్నదని నిప్పులు చెరిగారు. భీం ఘన్పూర్ పంప్‌హౌస్ వద్ద 2,160 క్యూసెకులు తీసుకునే కెపాసిటీ ఉం డగా కాంగ్రెస్ ప్రభుత్వం 1,700 క్యూసెకులే పంపింగ్ చేస్తున్నదని మండిపడ్డారు. భీం ఘన్‌పూర్‌లో 10 మోటార్లు ఉంటే ఐదారు మోటా ర్లు మాత్రమే ఎందుకు నడుపుతున్నారని ప్ర శ్నించారు. ఫుల్ కెపాసిటీలో ఎందుకు మోటా ర్లు నడపడం లేదు? గండిరామారం లిఫ్టు ఎందుకు బంద్ అయ్యింది అని ప్రశ్నించారు.

బీఆర్ఎస్ బృందంతో కలిసి హనుమకొండ జిల్లా దేవన్నపేటలోని దేవాదుల పంప్‌హౌస్‌ను పరిశీలిస్తున్న బీఆర్ఎస్ ఎల్పీ నేత హరీశ్‌రావు
బీఆర్ఎస్ హయాంలోనే దేవాదుల ప్రాజె క్టు పనులు వేగంగా పూర్తయ్యాయనని, కాం గ్రెస్ వచ్చిన తర్వాత తట్టెడు మట్టి తవ్వలేదని హరీశ్‌రావు విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభు త్వం మూడో దశను పూర్తి చేయగా 99% పనులు అప్పుడే పూర్తయ్యాయని తెలిపారు. ప్రాజెక్టు కోసం రూ.7,300 కోట్లు ఖర్చు చేసిందని వివరించారు. 2014 వరకు దేవాదుల ప్రాజెక్టు కింద 47వేల ఎకరాల ఆయకట్టు ఉండగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులతో ఆయకట్టు 3 లక్షల ఎకరాలకు పెరిగిందని చెప్పారు. ప్రాజెక్టుకు అవసరమైన 33వేల ఎకరాల్లో 30 వేల ఎకరాలను బీఆర్ఎస్ హయాంలోనే సేకరించామని తెలిపారు. మిగతా మూడు వేల ఎకరాలను సేకరిస్తే ప్రాజెక్టు పూర్తవుతుందని దీని వల్ల అదనంగా 2.40 లక్షల ఎకరాల ఆయకట్టు పెరుగుతుందని తెలిపారు. దేవాదుల ప్రాజెక్టును అద్భుతంగా తీర్చిదిద్దిన కేసీఆర్ సర్కార్.. 365 రోజులు గోదావరి నీటిని పంపింగ్ చేసేలా సమ్మక బ్యారేజీ నిర్మించిందని చెప్పారు.
ఉమ్మడి రాష్ట్రంలో దేవాదుల ప్రాజెక్టుకు 25 టీఎంసీల కేటాయింపులు ఉంటే కేసీఆర్ 60 టీఎంసీలకు పెంచారని గుర్తుచేశారు. ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చేలా ప్రణాళికలు చేశారని తెలిపారు. రెండున్నరేండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఎకరాకు అదనంగా నీళ్లు ఇవ్వలేదని, కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం వల్ల దేవాదుల నీళ్లు అందక ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులకు అన్యాయం జరుగుతున్నదని మండిపడ్డారు. 2026 మార్చిలోగా దేవాదులను పూర్తి చేస్తామని మంత్రులు ప్రకటించినా ఇప్పటికీ పది పైసల పని కూడా చేయలేదని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేండ్లలో 48లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లిచ్చి, 17 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు, 31 లక్షల ఎ కరాల స్థిరీకరణ చేస్తే.. కాంగ్రెస్ రెండున్నరేండ్లలో నాలుగు లక్షల ఎకరాలకైనా నీళ్లు ఇచ్చిం దా? అని ప్రశ్నించారు. సాగునీటి మంత్రి ఉత్తమ్ అసెంబ్లీలో మాట్లాడుతూ మొదటి ఏడాదిలో ఆరు లక్షలు, రెండో ఏడాదిలో ఆరు లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పారు అంటే.. మొత్తం 12 లక్షల ఎకరాలకు నీళ్లు ఇ చ్చారా? సాగునీటి మంత్రి సమాధానం చె ప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, అరూరి రమేశ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నాగుర్ల వెంకటేశ్వర్లు, ఏనుగుల రాకేశ్‌రెడ్డి పాల్గొన్నారు.
తొర్రూరు: ఎంపీ కడియం కావ్యకు వరంగల్‌లో ఓటు ఉంటే, మళ్లీ తొర్రూరులో ఓటు హక్కు వినియోగానికి అనుమతించడం చట్టవిరుద్ధమని హరీశ్‌రావు మండిపడ్డారు. శుక్రవా రం మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. తొర్రూరు మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల తీర్పు బీఆర్ఎస్కు అనుకూలంగా వ చ్చిందని, తొమ్మిది వార్డుల్లో కౌన్సిలర్లు గెలువడం ఇందుకు నిదర్శనమని పేరొన్నారు. అధికార బలంతో కాంగ్రెస్ ఎన్నికల ప్రక్రియ ను ప్రభావితం చేసిందని విమర్శించారు. అలంపూర్‌లో ఓటు మార్పునకు అనుమతి ఇ వ్వని అధికారులు, ఇకడ మాత్రం అనుమతించడం అధికార దుర్వినియోగానికి నిదర్శనమని హరీశ్‌రావు విమర్శించారు. దీనిపై న్యా యపరంగా పోరాటం చేస్తామని స్పష్టం చేశా రు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్కు ప్రజల్లో విశేష మద్దతు ఉందని, రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ భారీ విజయాన్ని సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
సిద్దిపేట, ఫిబ్రవరి 20( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలుచేస్తామని గొప్పలు చెప్పి, అన్ని వర్గాలను కాంగ్రెస్ సర్కార్ మోసం చేసిందని హరీశ్‌రావు మండిపడ్డారు. 26 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో వాస్తవాలకు దగ్గరగా బడ్జెట్ రూపొందించి, హామీలకు అనుగుణంగా నిధులు కేటాయించాలని ఉప ముఖ్యమంత్రి భట్టిని డిమాండ్ చేశారు. శుక్రవారం సిద్దిపేటలోని 37వ వార్డులో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. రాజీవ్ యు వవికాసం, ఎస్సీ, బీసీ, రైతు డిక్లరేషన్లన్నీ ఉత్తమాటలే అని ఆగ్రహం వ్యక్తంచేశారు. దళితులకు 18% రిజర్వేషన్లు, ఎస్సీ సబ్ ప్లాన్ అమ లు చేస్తామని మోసం చేశారని ధ్వజమెత్తారు.
సిద్దిపేట యువత కోసం ‘హరీశ్ అన్న ఉద్యోగ యాప్’నకు హరీశ్‌రావు శ్రీకారం చు ట్టారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం ఈ మొబైల్ యాప్‌ను ప్రారంభించి మాట్లాడారు. ‘యాప్‌ను ప్రారంభించుకున్న ఈ ప్రభు త్వ డిగ్రీ కాలేజీకి ఒక చరిత్ర ఉన్నది. కేసీఆర్ ఇక్కడే చదువుకున్నరు. ఒక రాష్ర్టాన్ని సాధించిన నాయకుడిని అందించిన కాలేజీ ఇది’ అని తెలిపారు. విద్యాపరంగా చాలా అభివృద్ధి చెం దామని, మరింత తీర్చిదిద్దుతానని అది తన బాధ్యత అని చెప్పారు. సిద్దిపేటలో ఐటీ టవర్‌ను కూడా తెచ్చి ఇకడి యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్నామని తెలిపారు. కొత్త కంపెనీలు కూడా వస్తుండటంతో మరిన్ని అవకాశాలు దకుతాయని చెప్పారు. ఈ యాప్‌ను సద్వినియోగం చేసుకొని జీవితంలో ఎదగాలని, ప్రభుత్వ ఉద్యోగాలు కూడా సాధించాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు.
హైదరాబాద్ ఫిబ్రవరి 20, (నమస్తే తెలంగాణ): రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం కండ్లు కాయలు కాసేలా ఎదురుచూసి, చికిత్సకు చేతి లో చిల్లిగవ్వలేక రిటైర్డ్ పోలీసు అధికారి మైస య్య ప్రాణాలు కోల్పోవడం బాధాకరం అని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన మైసయ్యది ముమ్మాటికీ ప్ర భుత్వ హత్యేనని శుక్రవారం ఎక్స్ వేదికగా ఆరోపించారు. గతేడాది ఫిబ్రవరిలో ఉద్యోగ విరమణ పొందిన మైసయ్యకు రావాల్సిన రూ.60 లక్షలు ఏడాదైనా చెల్లించకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. సర్కార్ నిర్లక్ష్యం వల్లే ఆయన కుటుంబం అప్పుల్లో కూరుకుపోవాల్సిన దుస్థితికి చేరుకున్నదని స్పష్టంచేశారు.
ప్రజల రక్షణ కోసం జీవితాంతం శ్రమించిన ఓ పోలీసు అధికారి దవాఖాన ఖర్చులకు డబ్బుల్లేక ప్రాణాలు కోల్పోవడం దిగ్భ్రాంతిని కలిగించిందని ఆవేదన వ్యక్తంచేశారు. చివరకు బిల్లు కట్టలేని పరిస్థితుల్లో తోటి రిటైర్డ్ పోలీసులు చందాలు వేసి మృతదేహాన్ని ఇంటికి పంపాల్సి వచ్చిందని, వారి దుస్థితికి కారణం కాంగ్రెస్ సర్కారు చేతగానితనమేనని ధ్వజమెత్తారు. మరణించిన రిటైర్డ్ పోలీసు అధికారి మైసయ్య కుటుంబానికి రావాల్సిన రూ.60 లక్షల విరమణ బెనిఫిట్స్‌తో పాటు ప్రత్యేక ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న ఆయన భార్యకు ప్రభుత్వ ఖర్చులతో వైద్యమందించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సర్కార్ వారికి అందిస్తున్న బహుమతి ఇదేనా? అని ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో పోలీసులకు మెరుగైన వైద్యమందేదని హరీశ్‌రావు గుర్తుచేశారు.
రైతుబంధు విషయంలో కాంగ్రెస్ సర్కార్ ఇప్పటికీ స్పష్టత ఇవ్వడం లేదని హరీశ్‌రావు విమర్శించారు. ఈ నెల 17న వేస్తమన్నురు.. ఇప్పుడు 20 తారీఖు వచ్చింది. కేసీఆర్ ఉన్నప్పుడు వరి నాట్లప్పుడు ఇచ్చేదని గుర్తుచేశారు. యూరియా కోసం చెప్పులు లైన్లో పెట్టే దుస్థితి వచ్చిందని మండిపడ్డారు. బడా కాంట్రాక్టర్లకు ఇస్తడు గానీ, బకచికిన రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వవా? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా స్పష్టతనివ్వాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలుచేస్తామని సోనియా, రాహుల్, రేవంత్ రాసిచ్చిన బాండ్ పేపర్లు ఏమైనయ్? 800 రోజులైనా ఒక్క హామీ దిక్కు లేదు. వృద్ధులు, గీత, చేనేత, బీడీ కార్మికులకు రూ.4,000 పింఛన్, మహిళలకు రూ.2,500 ఇస్తమని చెప్పి ఓట్లు దండుకున్నరు. ఒక్కరికైనా రూపాయి ఇచ్చిన్రా? భట్టి గారు ఈ బడ్జెట్లోనైనా నిధులిస్తరా? ఎగ్గొడుతరా?
– హరీశ్‌రావు