Delhi Rain : దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో కుండపోత వర్షం (Heavy Rain) కురుస్తోంది. ఎగతెగకుండా కురుస్తున్న వర్షంతో ఢిల్లీ రహదారులు జలమయమయ్యాయి. పలుచోట్ల రోడ్లు నదులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు తటాకాలుగా మారాయి. రోడ్లపై నీరు నిలువడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
రోడ్లపై వాన నీళ్లు నిలువడంతో పలు కూడళ్లలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాంతో ఉద్యోగాలకు వెళ్లేవాళ్లు, కూలీలు, కార్మికులు, స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. ఇదిలావుంటే ఇప్పటికే ఢిల్లీ వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీచేశారు. రోజంతా వర్షం కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.