వ్యవసాయంపై యువత ఆసక్తి చూపాలి
వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సాగు చేస్తే లా భాలు వస్తాయని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఎన్టీఆర్ స్టేడియంలో రైతుబడి మెగా అగ్రి షో-2026 కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
- రైతుబడి అగ్రిషోను ప్రారంభించిన గుత్తా సుఖేందర్‌రెడ్డి
హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సాగు చేస్తే లా భాలు వస్తాయని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఎన్టీఆర్ స్టేడియంలో రైతుబడి మెగా అగ్రి షో-2026 కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. మూడ్రోజులపాటు జరిగే ఈ అగ్రిషోలో వివిధ రాష్ర్టాల నుంచి 350 వర కు స్టాల్స్ ఏర్పాటు చేశారు. గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం వ్యవసాయరంగానికి మంచి డిమాండ్ ఉందని, యువ త ఈ రంగంలో రాణిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపడుతుందని, మారుతున్న కాలానుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని సూచించారు. రైతుబడి నిర్వాహకుడు జూలకంటి రాజేందర్‌రెడ్డి ఎంతోకాలంగా ఆత్మీయుడని, రైతుల కోసం నిరంతరం యూట్యూబ్ చానల్ ద్వారా కొత్త విషయాలను ప్రచారం చేస్తున్నారని ఈ కార్యక్రమంలో తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్‌రెడ్డి, తెలంగాణ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి, ఆదర్శ రైతులు తుమ్మల యుగేందర్, పాశం రాంరెడ్డి, రైతుబడి నిర్వాహకులు జూలకంటి రాజేందర్‌రెడ్డి, వివిధ జిల్లాల ఎఫ్‌పీవో ప్రతినిధులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

