Drinking Water | శామీర్పేట, ఏప్రిల్ 23 : వారంతా మంచినీళ్ల కోసం చాలా రోజులుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ సమస్యను పరిష్కరించుకునేందుకు ఇక ఆందోళనే శరణ్యమని భావించిన బస్తీ వాసులంతా రోడ్డెక్కారు. లాల్గడి మలక్పేట వాసులు ఇవాళ ఖాళీ బిందెలతో రోడ్డుపై భైఠాయించి నిరసన వ్యక్తం చేస్తూ.. ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా లాల్గడి మలక్పేట మాల బస్తీ వాసులు మాట్లాడుతూ.. మంచి నీటి కోసం మూడు వారాలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వివరించారు. పంచాయతీ కార్మికుల సమ్మెతో నీటి సమస్య మొదలైందని తెలిపారు. 20 రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని.. దీంతో వంటావార్పు చేయలేని పరిస్థితి ఎదురవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయంపై పంచాయతీ కార్యాలయం తెలిపిన స్థానిక ప్రజాప్రతినిధులకు విన్నవించినా ప్రయోజనం లేకపోవడంతో రోడ్డెక్కడం జరిగిందన్నారు బస్తీ వాసులు . ఇప్పటికైనా అధికారులు నీటి సమస్యను పరిష్కరించాలని.. లేదంటే కార్యాలయాలను ముట్టడిస్తామని బస్తీ వాసులు హెచ్చరించారు. కాలనీ వాసులకు గ్రామస్తులు మద్దతు ప్రకటించడంతో ధర్నా ఉధృతంగా మారింది.
Errabelli Dayakar Rao | ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో బీఆర్ఎస్లో భారీగా చేరికలు
KTR | పెంబర్తి వద్ద కేటీఆర్కు ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి