Labourers | దుండిగల్, ఏప్రిల్ 17 : దుండిగల్ మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులకు గత రెండు నెలల నుండి సరైన సమయంలో జీతాలు రాకపోవడంతో కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారని గండి మైసమ్మ-దుండిగల్ మండలం సీఐటీయూ కార్యదర్శి బొడిగ లింగస్వామి అన్నారు. సకాలంలో కార్మికులకు జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇవాళ దుండిగల్ మున్సిపాలిటి కార్యాలయం ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో పలువురు కార్మికులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ దుండిగల్ మండల కన్వీనర్ లింగస్వామి పాల్గొని మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో కార్మికులు కష్టాలు పడుతున్నారని సరైన సమయంలో జీతాలు అందక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దుండిగల్ మున్సిపాలిటీలో పనిచేసే కార్మికులకు 17వ తారీఖు వచ్చినప్పటికీ ఈ నెల జీతం రాలేదని, దీంతో కార్మికులు ఇంటి కిరాయిలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
చిన్న చిన్న అప్పులు కట్టలేక పొదుపు గ్రూపుల డబ్బులు కట్టలేక, నిత్యావసర వస్తువులు కొనలేక కార్మికులు అవస్థలు పడుతున్నారన్నారు. తక్షణమే మున్సిపల్ కమిషనర్ స్పందించి కార్మికులకు జీతాలు వచ్చే విధంగా చూడాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతీనెల ఒకటో తారీఖున ఉద్యోగులకు వేతనాలు ఇస్తున్నామని గొప్పలు చెబుతున్నారని, కానీ దుమ్ముధూళి మురికిలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులకు ఇప్పటివరకు జీతాలు ఇవ్వకపోవడం సిగ్గుచేటు అని మండిపడ్డారు.
అదేవిధంగా మున్సిపల్ కార్మికులకు రావాల్సిన బట్టలు, చెప్పులు, సబ్బులు, కొబ్బరి నూనె తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం సమస్యలను మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్ నాయక్ దృష్టికి తీసుకువెళ్లగా స్పందించిన ఆయన ప్రతీనెల 5వ తేదీ వరకు కార్మికులకు జీతాలు వచ్చే విధంగా చూస్తానని హామీ ఇచ్చినట్టు తెలిపారు. అదేవిధంగా తొందర్లోనే సబ్బులు, బట్టలు, కార్మికులకు రావాల్సిన సౌకర్యాలని ఇస్తానని హామీ ఇచ్చారన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ నాయకులు నరసింహ .సురేందర్ .ఎల్లయ్య .బాబు. స్వరూప.రేణుక. భవాని. కృష్ణవేణి. లక్ష్మి. తదితరులు పాల్గొన్నారు.
Minister Ponguleti | భూ వివాదాలు లేని రాష్ట్రంగా భూ భారతి చట్టం : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
Amit Shah: సీఆర్పీఎఫ్ 86వ రైజింగ్ డే.. 2026 నాటికి నక్సలిజం ఇక చరిత్రే: అమిత్ షా
Illegally Sand | అక్రమంగా నిల్వ చేసిన ఇసుకను సీజ్ చేసిన తహసీల్దార్ అనిత