Illegal Constructions | కుత్బుల్లాపూర్, జూన్ 23 : అక్రమ షెడ్డు నిర్మాణాలతోపాటు రోడ్డును ఆక్రమించి చేపట్టిన బాత్రూం నిర్మాణాలను సోమవారం కొంపల్లి మున్సిపాలిటీ కమిషనర్ కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ అధికారులు, సిబ్బంది సంఘటనా స్థలాలకు వెళ్లి కూల్చివేశారు.
పలువురు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ నెల 20న కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో వెలిసిన అక్రమ నిర్మాణాలపై నమస్తే తెలంగాణలో కొంపల్లిలో అక్రమ నిర్మాణాలు అనే శీర్షికపై వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. కథనంతో అధికారులు రంగంలోకి దిగి అక్రమంగా వెలిసిన నిర్మాణాలను కూల్చివేశారు.
ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా చేపట్టిన నిర్మాణాలపై ఉక్కు పాదం మోపుతామని కమిషనర్ కృష్ణారెడ్డి హెచ్చరించారు. ఎట్టి పరిస్థితులలో చట్ట విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపట్టరాదని అక్రమ నిర్మాణ దారులకు సూచించారు.
Alumni | ఎన్నాళ్లకెన్నాళ్లకు.. పాతికేళ్ల తర్వాత పూర్వ విద్యార్థులంతా కలిశారు
Rayaparthi | వ్యవసాయ భూములకు వెళ్లే బాట కబ్జా.. కలెక్టరేట్ ఎదుట రైతుల నిరసన
Suryapet | కేసుల పరిష్కారంలో న్యాయవాదుల సహకారం అవసరం : జూనియర్ సివిల్ జడ్జి ఆయేషా సరీన