MLA Bandari Lakshma Reddy | చర్లపల్లి, జూలై 6 : ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని పారిశ్రామికవాడలను అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేయనున్నట్లు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. చర్లపల్లి పారిశ్రామికవాడ ఐలా, సీఐఏకు నిర్వహించిన ఎన్నికల్లో ఐలా చైర్మన్‌గా గోవింద్‌రెడ్డి, సీఐఏ అధ్యక్షుడుగా శ్రీనివాస్‌రెడ్డి గెలుపొందడంతో ఐలా మాజీ చైర్మన్ కట్టంగూర్ హరీష్రెడ్డిలతో కలిసి వారు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిని కలిసి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పారిశ్రామికవాడలలో నెలకొన్న సమస్యలను గుర్తించి సమస్యలను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ముఖ్యంగా నూతనంగా ఐలా, సీఐఏ ఎన్నికలలో గెలుపొందిన కమిటీకి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.
ఐదు ఫేజ్‌లలో విస్తరించి ఉన్న చర్లపల్లి పారిశ్రామికవాడను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామని చెప్పిన ఎమ్మెల్యే పారిశ్రామికవాడలో సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బండారి నీలంరెడ్డి, నేమూరి మహేశ్‌గౌడ్, పారిశ్రామికవేత్త రవి తదితరులు పాల్గొన్నారు.
Sigachi Industries | సిగాచి ఇండస్ట్రీస్ పేలుడు ఘటనలో 41కి చేరిన మృతులు.. ఇంకా దొరకని 9 మంది ఆచూకీ
Dalai Lama | ఆధ్యాత్మిక గురువు దలైలామాకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు