Hydra | దుండిగల్, జూన్ 24: కుత్బుల్లాపూర్ నియోజక వర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లిలోని గేటెడ్ కమ్యూనిటీల ప్రహరీ గోడలను మంగళవారం హైడ్రా అధికారులు స్థానిక మున్సిపల్ అధికారులతో కలిసి తొలగించారు.
బాచుపల్లిలోని హైరజ్డ్ గేటెడ్ కమ్యూనిటీ, కెవిఆర్ విల్లాలు, మల్లంపేటలోని ప్రణీత్ ఆంటీలియా కమ్యూనిటీలకు సంబంధించిన ప్రహరీ గోడలు రోడ్డును ఆక్రమించి గతంలోనే నిర్మించగా స్థానికులు ఎన్నోసార్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే ప్రస్తుతం విపరీతంగా పెరిగిన ట్రాఫిక్ నేపథ్యంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని.. రోడ్డును అక్రమించి నిర్మించిన నిర్మాణాలను తొలగించాలని హైడ్రాకు ఫిర్యాదులు వెలువెత్తడంతో కూల్చివేతలు చేపట్టారు.
ప్రజలు కాలనీల చుట్టూ ఉన్న ప్రహరీని కూల్చివేస్తే తమకు రక్షణ ఎలా ఉంటుందని కొద్దిసేపు స్థానికులు ఆందోళనకు దిగారు. కానీ రోడ్డును ఆక్రమించి ప్రహరీ నిర్మించడం, అవి గేటెడ్ కమ్యూనిటీలు కావని అధికారులు తేల్చి చెప్పడంతో ఆందోళన సద్దుమణిగింది.
Garidepalli : ఎన్ఎఫ్బీఎస్ లబ్ధిదారులకు ఆర్థిక సాయం : తాసీల్దార్ కవిత
Weather Report | నాలుగు రోజులు వానలే.. హెచ్చరించిన వాతావరణశాఖ
Ram Mohan Naidu | బ్లాక్‌బాక్స్ భారత్‌లోనే ఉంది : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు