Prajavani | కుత్బుల్లాపూర్, ఏప్రిల్ 7: ప్రజా సమస్యలపై ప్రతి సోమవారం జరిగే ప్రజావాణిలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. సోమవారం కుత్బుల్లాపూర్ జంట సర్కిల్ కార్యాలయం పరిధిలో జరిగిన ప్రజావాణిలో ప్రజలు తమ సమస్యలపై ఫిర్యాదులు చేశారు.
కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలో ఆరు సమస్యలపై ఫిర్యాదులు, గాజుల రామారం సర్కిల్ పరిధిలో నాలుగు ఫిర్యాదులు.. మొత్తం 10 ఫిర్యాదులు అందినట్లు జంట సర్కిళ్ల ఉప కమిషనర్లు నరసింహ, మల్లారెడ్డి తెలిపారు. ఈ మేరకు ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సకాలంలో పరిశీలించి పరిష్కార మార్గాలు చూపాలని ఆయా విభాగాల అధికారులతో చర్చించారు.