Illegal Constructions | పోచారం, ఏప్రిల్ 4 : ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ పరిస్థితి పోచారం మున్సిపాలిటీలో కొనసాగుతుంది. ప్రభుత్వ భూములపై కన్నేసిన మాజీ ప్రజా ప్రతినిధులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అధికారులు, ప్రభుత్వ పెద్దల సహకారంతో కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములను అక్రమంగా ఆక్రమించి యధేచ్చగా నిర్మాణాలు చేపడుతున్నారు.
ఇందుకు మున్సిపాలిటీ టౌన్‌ప్లానింగ్ అధికారులు అనుమతులు కూడా జారీ చేయడం మరో కోణం. పోచారం మున్సిపాలిటీ చౌదరిగూడ పరిధిలోని సర్వే నంబర్ 867లోని ప్రభుత్వ భూమిలో గత కొంత కాలంగా వందలాది నిర్మాణాలు కొనసాగుతున్నాయి. అధికారులు ఈ వ్యవహారంలో చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తూపోతున్నారు. గతంలో ఈ సర్వే నంబర్లోని ప్రభుత్వ భూమిని కాపాడాలని ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పెద్దలే ఆందోళన చేసి హంగామా చేశారు. ప్రస్తుతం ఇదే ప్రభుత్వ పెద్దలు ఈ ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతుంటే పట్టించుకోక పోవడం బాధాకరమని ఇక్కడి ప్రజలు వాపోతున్నారు.
నిర్మాణాలకు అధికారుల అనుమతి..
ఇక్కడి ప్రభుత్వ భూమిలో జరిగే అక్రమ నిర్మాణాలకు మున్సిపాలిటీ టౌన్‌ప్లానింగ్ అధికారులే అనుమతులు మంజూరు చేశారు. ఇది ఆలస్యంగా వెలుగులోకి రావడంతో జరిగిన పొరపాటును కప్పిపుచ్చుకునేందుకు దిద్దుబాటు చర్యలు చేపట్టారు.
అయితే అధికారులు భారీ ఎత్తున ముడుపులు తీసుకొని ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేయడం తీవ్ర విమర్శలకు దారి తీస్తుంది. పోచారం మున్సిపాలిటీలోని ప్రభుత్వ భూముల వ్యవహారంలో జిల్లా కలెక్టర్ కల్పించుకొని సమగ్ర విచారణ జరిపి చర్యలు చేపట్టాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు.
ప్రభుత్వ భూమిలో నిర్మాణాలపై చర్యలు : కమిషనర్ వీరారెడ్డి
ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవని పోచారం కమిషనర్ వీరారెడ్డి అన్నారు. ప్రభుత్వ భూముల రక్షణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని అన్నారు. చౌదరిగూడలోని ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలపై త్వరలో చర్యలు తీసుకుంటామని తెలిపారు. సబ్‌రిజిస్ట్రార్ సేల్‌డీడ్‌ను చూసి టీపీఓ అనుమతి మంజూరు చేసిందని అన్నారు. ఈ అనుమతిని కూడా రద్దు చేస్తున్నామని కమిషనర్ తెలిపారు.
Passengers | 40 గంటలుగా తుర్కియే ఎయిర్‌పోర్ట్‌లోనే.. వసతుల లేమితో భారతీయ ప్రయాణికుల అవస్థలు
Alampur | అలంపూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గవ్వల శ్రీనివాసులు
Taj Mahal: టికెట్ సేల్స్ ద్వారా ఆదాయం.. టాప్‌లో తాజ్‌మహల్