Passengers | 200 మందికిపైగా భారతీయ ప్రయాణికుల (Passengers)తో లండన్ నుంచి ముంబైకి బయల్దేరిన విమానం తుర్కియే (Turkey)లో అత్యవసరంగా ల్యాండ్ అయిన విషయం తెలిసిందే. గురువారం వర్జిన్ అట్లాంటిక్ విమానం (Virgin Atlantic flight) వైద్య అత్యవసర పరిస్థితి కారణంగా తుర్కియేలోని మారుమూల ‘దియార్ బకిర్’ విమానాశ్రయంలో (Diyarbakir Airport) ల్యాండింగ్ జరపాల్సి వచ్చింది. అయితే, విమానం ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యి కొన్ని గంటలు గడుస్తున్నా తిరుగు ప్రయాణంపై స్పష్టత రాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
దాదాపు 40 గంటలుగా విమానాశ్రయంలోనే పడిగాపులు కాస్తున్నామని ప్రయాణికులు వాపోతున్నారు. అక్కడ వసతి సహా ఇతర ఏర్పాట్లేవీ లేవని, తమ ప్రయాణం ఎప్పుడన్నది అధికారులు చెప్పటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆహారం కూడా లేదని, 250 మందికి ఒకే ఒక్క టాయిలెట్ ఉందని చెప్పారు. చలిని తట్టుకోవడానికి కనీసం దుప్పట్లు కూడా ఇవ్వలేదని మండిపడుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు.
My family along with 250+ passengers have been inhumanely treated by @virginatlantic .
Why is this chaos not being covered in the @BBCWorld or global media?? Over 30 hours confined at a military airport in Turkey.
In contact with the @ukinturkiye to please more pressure needed pic.twitter.com/TIIHgE07bb— Hanuman Dass (@HanumanDassGD) April 3, 2025
మరోవైపు ప్రయాణికుల ఆందోళన నేపథ్యంలో వర్జిన్ అట్లాంటిక్ ఎయిర్‌లైన్స్ స్పందించింది. విమానంలో సాంకేతిక లోపం కారణంగా అత్యవసరంగా తుర్కియేలో ల్యాండ్ చేయాల్సి వచ్చిందని పేర్కొంది. ప్రయాణికులు, సిబ్బంది భద్రతే తమకు ముఖ్యమని చెప్పింది. శుక్రవారం మధ్యాహ్నం 12 తర్వాత విమానం తిరిగి బయలుదేరుతుందని తెలిపింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
A Virgin Atlantic flight (VS358) that took off from London Heathrow to Mumbai on 2nd April was diverted to Diyarbakır Airport in Turkey due to an urgent medical reason. After receiving the necessary technical approvals, the flight will resume its onward journey to Mumbai from…
— ANI (@ANI) April 4, 2025
కాగా, వర్జిన్ అట్లాంటిక్‌కి చెందిన VS358 విమానం ఏప్రిల్ 2న (స్థానిక కాలమానం ప్రకారం) ఉదయం 11:40 గంటలకు లండన్‌లోని హీత్రూ విమానాశ్రయం నుండి బయలుదేరి ఏప్రిల్ 3న తెల్లవారుజామున 1:40 గంటలకు ముంబైలో ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే, ఒక ప్రయాణికుడికి అత్యవసర వైద్య సహాయం అవసరమైనందున విమానాన్ని తుర్కియేకి దారి మళ్లించారు. ఏప్రిల్ 2 సాయంత్రం 7 గంటల సమయంలో దియార్బకిర్ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. అప్పటి నుంచి ఆ విమానం ఇప్పటి వరకూ బయల్దేరలేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
Also Read..
Veena Vijayan: కేరళ సీఎం విజయన్ కుమార్తెపై ఆర్థిక నేరం కేసులో విచారణకు కేంద్రం అనుమతి
Maharastra: 13 ఏళ్ల బాలికపై అత్యాచారం.. నిందితుడికి 20 ఏళ్ల జైలుశిక్ష, 20వేల ఫైన్
Heart Attack | 25వ వివాహ వార్షికోత్సవం.. స్టేజ్‌పై భార్యతో డ్యాన్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన భర్త